గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (10:20 IST)

గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ.. షమీకి చీలమండ గాయం

shami
ఐపీఎల్ 2024 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పేస్ ఆటగాడు మహ్మద్ షమీ ఎడమ చీలమండ గాయం కారణంగా యూకేలో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం షమీ ఐపీఎల్ 2024కు దూరమయ్యే అవకాశం వున్నట్లు సమాచారం. 
 
ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా మారిపోవడానికి తోడు షమీ ఈ టోర్నీలో ఆడకపోవడం గుజరాత్ టైటాన్స్‌కు దెబ్బేనని క్రీడా పండితులు అంటున్నారు. 
 
ప్రస్తుతం కొత్త కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ నాయకత్వంలో గుజరాత్ ఐపీఎల్ 2024లో బరిలోకి దిగనుంది. 2022లో 20 వికెట్లు, IPL 2023లో 28 వికెట్లతో జీటీ విజయంలో కీలక పాత్ర పోషించిన షమీని ఫ్యాన్స్ మిస్ అవుతారనే చెప్పాలి. 
 
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగం కాని 33 ఏళ్ల షమీ చివరిగా నవంబర్‌లో వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆడాడు.