1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. England Cricket Captain Eoin Morgan comments on kolkata ODI

కేదార్ జాదవ్ రనౌట్‌తో గెలవలేదు... గెలుపుకు అదే కారణం : మోర్గాన్

కోల్‌కతా వేదికగా భారత్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో కేదార్ జాదవ్ రనౌట్

England Cricket
కోల్‌కతా వేదికగా భారత్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో కేదార్ జాదవ్ రనౌట్ కావడం వల్లే ఇంగ్లండ్ గెలిచిందన్న చర్చ సరైనది కాదన్నారు. అసలు తమ గెలుపునకు ముఖ్య కారణం ఈడెన్ గార్డెన్ మైదానమేనని చెప్పారు. ఈ మైదానంతో పాటు.. పిచ్ అచ్చం ఇంగ్లండ్ మైదానం, పిచ్‌‌లాగే ఉందని అందుకే విజయం సాధించినట్టు చెప్పారు. 
 
ఇక్కడ పిచ్‌లు భారత ఆటగాళ్లకు బాగా అలవాటని అందుకే భారత బ్యాట్స్‌మన్ బాగా రాణించగలిగారని అన్నాడు. అయితే తమ దేశంలో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి ముందుగా ఇలాంటి పిచ్‌పై మ్యాచ్ జరగడం అందులో తాము గెలవడంతో మంచి ప్రాక్టీస్‌గా భావిస్తున్నట్టు అభిప్రాయపడ్డాడు. 
 
కాగా, ఈ వన్డే మ్యాచ్‌లో భారత్ 5 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెల్సిందే. తీవ్ర ఉత్కంఠత మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో ఇంకా నాలుగు బంతులు ఉన్నంత వరకూ మ్యాచ్ భారత్ వైపే ఉంది. ఆ సమయంలో కేదార్ జాదవ్ అనూహ్యంగా ఔట్ కావడంతో కోహ్లీసేనకు ఓటమి తప్పలేదు. 
About Writer
pnr
తర్వాతి కథనం
ఐపీఎల్‌లో ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ విజయం మనదే: విరాట్ కోహ్లీ