అత్యాచారం కేసులో ఐపీఎల్ క్రికెటర్ అరెస్టు
అత్యాచారం కేసులో ఐపీఎల్ క్రికెట్ అరెస్టయ్యాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌కు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఓ వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన అత్యాచారం, బెదిరింపుల కేసులో అభిషేక్‌ను కోల్‌కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కర్ణాటకకు చెందిన ఓ వైద్య విద్యార్థిని జూన్‌లో హుగ్లీలోని మోగ్రా పోలీస్ స్టేషన్‌లో అభిషేక్‌పై ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఇద్దరం కలిసి విదేశాలకు కూడా వెళ్లామని ఆమె తెలిపింది. గత యేడాది నుంచి తమ మధ్య విభేదాలు తలెత్తాయని, తనపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొంది.
ఈ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అభిషేక్‌ను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో ఆ యువతి కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెటర్‌ను అరెస్టు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో మంగళవారం అభిషేక్ పోరెల్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
