1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. mahbubnagar gang rape minor girl assaulted in hanwada, two arrested

ప్రేమజంటను బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారం...

victim woman
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా హన్వాడలో ఓ దారుణం జరిగింది. ఏకాంతంగా కూర్చొనివున్న ప్రేమజంటను కొందరు కామాంధులు బెదిరించి, బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వారి వద్ద ఉన్న రూ.6 వేలు దోచుకున్నారు. దీనిపై ప్రియుడు 100కు డయల్ చేయగానే దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని, ఆమె ప్రియుడు శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు తండా సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. వారిని గమనించిన మహబూబ్ నగర్‌కు చెందిన అశోక్, లక్ష్మణ్ అనే ఇద్దరు యువకులు వారిని అడ్డగించారు. 
 
తొలుత ప్రేమజంటను బెదిరించి వారి వద్ద ఉన్న రూ.6 వేలు నగదు వసూలు చేసారు. ఆ తర్వాత ప్రియుడుని భయపెట్టి పక్కకు నెట్టేసి బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ సమయంలో ప్రియుడు ధైర్యం చేసి డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, నిందితులను రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ ప్రాంతంలో గంతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఈ కేసులతో ఈ ఇద్దరు నిందితులకు సంబంధం ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
భార్య మరొకరితో వెళ్లిపోయిందనీ ఇద్దరు పిల్లలను కడతేర్చి ఆత్మహత్య చేసుకున్న భర్త