1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Mancherial : Dalit man's House torched over inter-caste marriage

కులాంతర వివాహం చేసుకున్న దళిత యువకుడు... ఇంటికి నిప్పంటించిన యువతి తల్లిదండ్రులు

fire
ఓ దళిత యువకుడు తాను ప్రేమించిన బీసీ వర్గానికి చెందిన యువతిని కులాంత వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఆగ్రహంతో ఊగిపోతూ, ఆ దళిత యువకుడు ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ఇంటితో పాటు ఇంట్లోని సామాగ్రి కూడా పూర్తిగా కాలిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దాంపూర్‌ గ్రామానికి చెందిన దళిత యువకుడు జంగపెల్లి సులేమాన్‌ అలియాస్‌  సురేందర్‌ అదే గ్రామానికి బీసీ కులానికి చెందిన అమ్మాయి అంజలిని ప్రేమించి శుక్రవారం కరీంనగర్‌లో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన అమ్మాయి కుటుంబ సభ్యులు.. అంజి, సంపత్, తండ్రి లక్ష్మణ్‌లు రాత్రి 9 గంటల సమయంలో సులేమాన్‌ ఇంటిపై దాడికి వెళ్లారు. 
 
ఇంటికి తాళం వేసి ఉండటంతో, తాళం పగులగొట్టి, తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఇంట్లో వస్తువులపై పోసి నిప్పంటించారు. పొగలు వ్యాప్తి చెందగా చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 
 
ఇంట్లోని సామగ్రి కాలిపోగా రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. యువకుడి తండ్రి జంగపెల్లి పెద్ద పోషం ఫిర్యాదు మేరకు పోలీసులు చెరుకు అంజి, చెరుకు సంపత్, చెరుకు లక్ష్మణ్‌లపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తోషఖానా-2 అవినీతి కేసు : ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 యేళ్ల జైలు