1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Shocking details in honor killing in biramguda sangareddy

సంగారెడ్డి పరువు కేసు.. యువతి నాలుగు నెలల గర్భవతి.. అడ్డు రావడంతో దెబ్బలు పడ్డాయ్

crime scene
సంగారెడ్డి పరువు హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. అమ్మాయి ఇంటికి శ్రవణ్ వచ్చాడని.. అనుకోని పరిస్థితుల్లో హత్యకు గురయ్యాడు. శ్రవణ్ సాయి హత్య కేసులో మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఆరు నెలల క్రితం శ్రవణ్ సాయి కుటుంబంతో మాట్లాడేందుకు అమీర్‌పేటలోని అతని పెదనాన్న ఇంటికి యువతి తల్లి, బాబాయ్ వెళ్లారు.

అక్కడ తన కూతురి జోలికి రావొద్దని శ్రవణ్ సాయి పెదనాన్న, పెద్దమ్మ లకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో యువతి బాబాయ్, శ్రవణ్ సాయి పెదనాన్నకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
అలాగే ఈ పరువు హత్యకు సంబంధించి యువతి తల్లి నిజాలు వెల్లడించింది. తన కుమార్తె మెసేజ్ ఇస్తేనే శ్రవణ్ సాయి ఇంటికి వచ్చాడని తెలిపింది. తన కూతురు నాలుగు నెలల గర్భవతి అని మనసులోని మాటను బయటపెట్టింది. గండిమైసమ్మ దగ్గర పార్కులో వీరిద్దరూ ఏకాంతంగా కలిశారని ఆరోపించింది.

ప్రెగ్నెన్సీ సంగతి అమ్మకు తెలిసిందని తన కూతురు అబ్బాయితో చెప్పడంతో అతను ఇంటికి వచ్చాడని.. తన కూతురు తప్పు చేసిందని యువతి తల్లి తెలిపింది. అందువల్లే ఆమెను కొట్టానని.. కూతురును కొడుతుంటే శ్రవణ్ మధ్యలో అడ్డంగా వచ్చాడని చెప్పింది. అయినా ఇంకొకరి పిల్లల్ని తానెందుకు కొడతానని.. తప్పు చేసిన తన కుమార్తెను కొట్టానని వెల్లడించింది.

ఈ క్రమంలోనే శ్రవణ్‌కు దెబ్బలు తగిలాయని.. ఆ అబ్బాయి ఎవరో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చింది. యువకుడితో తాను ఒక్కసారి కూడా ఫోన్ మాట్లాడలేదని యువతి తల్లి మాటలు చెప్పింది. కానీ శ్రవణ్ స్నేహితులు మాత్రం క్రికెట్ బ్యాటుతో కొట్టి శ్రవణ్ చనిపోలేదని తెలిపారు. యువతి తల్లి సాయిని టార్చెర్ పెట్టి చంపినట్లు కనిపిస్తుందని తెలిపారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ISRO: డిసెంబర్ 15న 6.5 టన్నుల బ్లూబర్డ్-6 ఉపగ్రహ ప్రయోగం