సోమవారం, 31 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 28 మార్చి 2025 (12:09 IST)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

Accused
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పురితోట గ్రామంలో పరువు హత్య జరిగింది. తన కుమార్తెను ప్రేమించాడన్న ఆగ్రహంతో అమ్మాయి తండ్రి యువకుడిని గొడ్డలితో అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారి ఉలిక్కిపడింది.
 
కాగా గత కొన్ని నెలలుగా పూరెల్ల సాయికుమార్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం యువతి తండ్రికి తెలిసింది. దీనితో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు గొడ్డలి తీసుకుని యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసాడు. దీనితో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.