ఆదివారం, 23 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 22 మార్చి 2025 (16:49 IST)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

girl - father
ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలు తమ చేయి దాటిపోతుంటే కన్నతల్లిదండ్రులు తల్లడిల్లిపోతూ, ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో గుండెలు పిండేసే దృశ్యం ఒకటి జరిగింది. ఎంతో ప్రేమగా పెంచుకున్న కుమార్తె.. ప్రేమించినవాడితో వెళ్లిపోతుంటే ఆ కన్నతండ్రి  కూడా ఓర్చుకోలేకపోయాడు. 
 
కుమార్తెను వెంబడించి ప్రియుడుతో వెళ్లొద్దంటూ కాళ్ళమీదపడి ప్రాధేయపడినా ఆ కుమార్తె కనికరించలేదు. గుండెలు పిండేసే ఈ దృశ్యం ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. 
 
తన కుమార్తె ప్రేమించి యువకుడు వెళ్లిపోతుంటే ఇంటికి రమ్మని కుమార్తెను కోరాడు. తన కుమార్తెను వదిలివేయాలని ఆ యువకుడు కాళ్లపై పడి దణ్ణం పెట్టిమరీ వేడుకున్నాడు. తండ్రి అల్లాడిపోతున్నా ఆ కుమార్తె మనసు మాత్రం ఏమాత్రం కరగలేదు. తను ప్రేమించిన యువకుడుతో వెళ్లేందుకే సిద్ధపడింది. తమను వదిలివేయాలని తండ్రి కాళ్లకు దణ్ణం పెట్టింది.