నాన్న డ్రమ్ములో ఉన్నాడు... తండ్రి హత్యపై ఆరేళ్ళ పాప నోట నుంచి వచ్చిన నిజం..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ హత్య కేసులో సంచలన నిజం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ళ కుమార్తె పుట్టిన రోజు కోసం లండన్ నుంచి స్వదేశానికి వచ్చిన సౌరభ్... తన కన్నబిడ్డ ముందే కట్టుకున్న భార్య తన ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. భర్త శవాన్ని 15 ముక్కలు చేసి ఓ డ్రమ్ములో ఉంచి సిమెంట్‌తో సమాధి చేశారు. కొడుకు కనిపించడం లేదంటూ సౌరభ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. కొడుకు కనిపించడం లేదంటూ సౌరభ్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ హత్య కేసు విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే, ఈ హత్యను కళ్ళారా ఆరేళ్ల చిన్నారి చూసింది. తన తల్లి మరో వ్యక్తితో కలిసి తండ్రిని హత్య చేసి, మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో దాచడం గమనించింది. అయితే, అది దాచడం కాదని, నాన్నను చంపేశారని ఆ చిన్నారికి తెలియదు. మీ నాన్న ఏరమ్మా అని అడిగిన చుట్టుపక్కల వాళ్లకు నాన్న డ్రమ్ములో ఉన్నాడు అంటూ సమాధానం చెప్పింది. ఆ మాటల వెనుకున్న విషాదం తెలియక ఆ చిన్నపిల్ల ఏదో చెబుతోందని వారంతా మిన్నకుండిపోయారు. కానీ, నిజంగానే ఆ పాప తండ్రి నిర్జీవంగా మారి డ్రమ్ములో సమాధి అయ్యాడని వారు ఊహించలేక పోయారు.