1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Son kills father over Chicken curry dispute in Jangaon

పచ్చటి కుటుంబంలో చిచ్చుపెట్టిన నాటు కోడికూర... ఎక్కడ?

murder
పచ్చటి కుటుంబంలో నాటు కోడి కూర చిచ్చుపెట్టింది. భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసింది. ఫలితంగా కన్నకొడుకు చేతిలో తండ్రి హతమయ్యడు. తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో ఈ దారుణం జరగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి అనే గ్రామానికి చెందిన జంగిటి రమేష్‌ (42) మంగళవారం రాత్రి 10 గంటలకు ఒక నాటు కోడి తీసుకొని వచ్చారు. కూర వండమని భార్య అనూషకు చెప్పారు. అయితే, ఇపుడు చేపలకూర చేశనని, ఇపుడు నాటు కోడి కూర వద్దని ఆమె చెప్పింది. ఈ క్రమంలో వారిద్దరికీ గొడవ జరిగింది. పక్కనే ఉన్న కుమారుడు గణేష్‌ మా అమ్మను ఎందుకు తిడుతున్నావు అని ప్రశ్నించాడు. దీంతో అతడిపై రమేష్‌ చేయిచేసుకున్నాడు. 
 
క్షేణికావేశంలో గణేశ్‌ పక్కనే ఉన్న రోకలిబండతో తండ్రి తలపై బాదాడు. రమేష్‌ అక్కడే పడిపోవడంతో సుంకరి హరీష్‌ అనే వ్యక్తి గమనించి చికిత్స నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని అక్కడికి వైద్యులు సూచించారు. హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే బుధవారం ఉదయం 11 గంటలకు రమేశ్‌ మృతి చెందారు. మృతుడి సోదరుడు శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మండుతున్న పెట్రోల్ ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం