1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Wife Kills Husband With Lover's Help In Telangana

ప్రియుడిపై మోజు... బీమా సొమ్ము కోసం భర్తను చంపేసిన భార్య

murder
ప్రియుడిపై మోజుపడిన ఓ మహిళ.. బీమా సొమ్ముకోసం భర్తను హత్య చేసింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం మర్కల్‌ గ్రామానికి చెందిన కంచర్ల రేణుక, కంచర్ల రాజయ్య (45) దంపతులు. మే 22వ తేదీన రాజయ్య ద్విచక్ర వాహనంపై పొలం పనులకు వెళ్తుండగా గుర్తు తెలియని జంతువు అడ్డురావడంతో వాహనం అదుపు తప్పి తీవ్ర గాయాలై మృతి చెందాడని భార్య రేణుక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా భార్య రేణుక, ఆమె ప్రియుడు గంగాశేఖర్‌లను నిందితులుగా గుర్తించారు. రేణుక, గంగాశేఖర్‌ల మధ్య గత నాలుగు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. తమకు అడ్డుగా ఉన్న రాజయ్యను తొలగించి ఆయన పేరుమీద ఉన్న బీమా సొమ్ము కాజేసేందుకు వారివురు పథకం పన్నారు. 
 
ఈ క్రమంలో మే 21వ తేదీన గంగాశేఖర్‌.. రాజయ్యను గాంధారి తీసుకెళ్లి మద్యం తాగించాడు. మత్తులో ఉన్న రాజయ్యను తిర్మన్‌పల్లి శివారులోకి తీసుకొచ్చి ఐరన్‌ రాడ్డుతో తలపై గట్టిగా బాదాడు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి అక్కడి నుంచి జారుకున్నాడు. 
 
పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావడంతో నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. సాంకేతికతను ఉపయోగించి కేసును చాకచక్యంగా ఛేదించిన సదాశివనగర్‌ సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై పుష్పరాజ్, సిబ్బంది నరేశ్, రంజిత్‌లను ఎస్పీ అభినందించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
Official: తెలంగాణలో జనసేన-టీడీపీల మధ్య పొత్తు లేదు..