ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య.. దోపిడి దొంగలని డ్రామా చేసింది..
భర్తను చంపే భార్యల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. వివాహేతర సంబంధాల కారణంగా భార్యాభర్తల అనుబంధాలు మంటగలిసిపోతున్నాయి. అఫైర్ల కారణంగా జరిగేన నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో దారుణ చోటుచేసుకుంది.
ప్రియుడితో కలిసి భర్తను ఓ మహిళ హత్య చేయించింది. ఆపై దోపిడిగా తతంగాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ దొరికిపోయింది. పక్కా ప్లాన్ ప్రకారం భర్తను దోపిడి దొంగలే చంపించారని నమ్మించాలనుకుంది.
కానీ పోలీసులు భార్య అసలు గుట్టును పోలీసులు బయటపెట్టారు. ప్రియుడితో కలిసి తన భర్త దేవకృష్ణ పురోహిత్‌ను నిందితురాలు ప్రియాంక, ఆమె ప్రియుడు కమలేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
విచారణలో కృష్ణ తలపై పదునైన ఆయుధంతో కొట్టి, ఇంట్లోని విలువైన వస్తువులను దోచుకెళ్లినట్లు ప్రియాంక డ్రామా చేసింది. ఈ ఘటనలో దేవకృష్ణ తీవ్రగాయాలతో మృతి చెందాడు. భర్తను చంపేందుకు లక్ష రూపాయలకు ఒక కిల్లర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితులపై హత్య, కుట్ర కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.