1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Muslim women join Nagula Chavithi rituals in Kothagudem, reflect communal harmony

కొత్తగూడెంలో నాగుల పుట్ట వద్ద పాలు పోసిన ముస్లిం మహిళలు

Nagulachavithi
Nagulachavithi
కొత్తగూడెంలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. నాగ దేవతలను పూజించే నాగుల చవితి పండుగ సందర్భంగా జరిగింది. రుద్రాంపూర్ ప్రాంతంలో, హిందూ మహిళలతో కలిసి కొందరు ముస్లిం మహిళలు తమ సాంప్రదాయ దుస్తుల్లో ఉండి నాగుల పుట్ట వద్ద పాలు పోసి తమ భక్తిని చాటుకున్నారు. హిందూ ధర్మానికి సంబంధించిన ఈ ఆచారాల్లో వారు పాల్గొనడం స్థానికుల దృష్టిని ఆకర్షించింది.
 
కుల, మత విభజనలను దాటి, ఇతరుల ఆచారాలను, సంప్రదాయాలను గౌరవించడం ద్వారా వారు భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చాటిచెప్పారు. ఈ ముస్లిం మహిళల భాగస్వామ్యం, భారతదేశపు ప్రత్యేక లక్షణమైన భిన్నత్వంలో ఏకత్వంకి ఒక బలమైన నిదర్శనమని పలువురు పేర్కొన్నారు. 
 
కులమతాలకు అతీతంగా ఇతరుల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగల్లో భాగస్వాములు కావడం భారతీయ సంస్కృతిలోని గొప్పతనానికి నిదర్శనంగా నిలిచింది. మత సామరస్యం, సోదరభావం, పరస్పర గౌరవం వెల్లివిరిసిన ఈ దృశ్యం పలువురిని ఆకట్టుకుంది. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత అని చాటిచెప్పేలా ముస్లిం మహిళల భాగస్వామ్యం నిలిచింది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఎమ్మెల్సీ చింతపండు నవీన్ పాదయాత్ర.. కాన్వాయ్‌ని ఢీకొట్టిన లారీ.. మహిళ మృతి