1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. No compromise when it comes to remuneration – that’s why Deepika Padukone said no to working with Prabhas!

Deepika Padukone : పారితోషికం విషయంలో నో కాంప్రమైజ్ - అందుకే ప్రభాస్ తో చేయనన్న దీపికా పదెకొనే !

Prabhas, Deepika Padukone
Prabhas, Deepika Padukone
స్పిరిట్ సినిమా ఆరంభంలో ప్రభాస్ కాంబినేషన్ లో దీపికా పదెకొనే నటిస్తుందని కొన్ని ఫొటోలు కూడా బయటకు చిత్ర టీమ్ వెల్లడించింది. కానీ కొద్దిరోజులకే ఆమె ప్రభాస్ తో నటించనని తేల్చిచెప్పింది. దానితో ప్రభాస్ మీద అభాండాలు ఏవో వేసినట్లుగా కొందరు భావించారు. కాగా, ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో దీపికా పదుకొణె మాట్లాడుతూ, "నేను ఇటీవల ఒక దక్షిణాది చిత్ర ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాను. ఎందుకంటే, అందులో కథానాయకుడికి నాకంటే ఎక్కువ పారితోషికం ఇస్తున్నారు. నేను కూడా సమానమైన పారితోషికం అడిగాను, కానీ వారు ఇవ్వలేకపోయారు" అని చెప్పారు.
 
 
ఎందుకు ఇవ్వలేకపోయారని అడిగినప్పుడు, కథానాయికకు చెల్లించేంత బడ్జెట్ లేదని వారు సమాధానమిచ్చారు. ఇది 'స్పిరిట్' సినిమాకు సంబంధించిన విషయం. దీపిక ఇంకా మాట్లాడుతూ, "ఆ నటుడితో పోలిస్తే నేనే ఎక్కువ విజయవంతమైన నటిని, ఇప్పటివరకు చాలా సినిమాలు చేశాను, అందుకే నేను సమాన పారితోషికం అడిగాను" అని పేర్కొన్నారు.
 
అంతేకాకుండా, సందీప్ రెడ్డి వంగా సోదరుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దీపిక తన పారితోషికంతో పాటు సినిమా లాభాల్లో 10% వాటా కూడా అడిగారని వెల్లడించారు.
 
దీపికా గారికి నేను చెప్పాలనుకున్నది ఒక్కటే: ప్రభాస్ అన్నకు, మీకు ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే—ఒక ప్రాజెక్ట్ పట్ల మీకు ఆయనకున్నంత నిబద్ధత లేదు. అందుకే మీరు 'కల్కి' సినిమా నుండి అకస్మాత్తుగా తప్పుకున్నారు అని తెలియజేశారు.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Sony Telugu channel : ప్రముఖ ఛానల్స్ కు పోటీగా సోనీ తెలుగు ఛానల్ - చెన్నైలో వచ్చే ఏడాది ప్రారంభం ?