1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Sai Durga Tej attended Pawan Kalyan's birthday celebrations

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలకు హాజరైన సాయి దుర్గా తేజ్

Pawan fans with Sai tej
Pawan fans with Sai tej
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా కూకట్‌పల్లిలోని గోపాల్ నగర్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ప్రముఖ హీరో సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వేడుకల్లో పాల్గొని, అక్కడికి వచ్చిన చిన్నారులతో ముచ్చటించారు.
 
చిన్నారులతో కలిసి సాయి దుర్గా తేజ్ కేక్ కట్ చేసి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.
 
అనంతరం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సాయి దుర్గా తేజ్ సందర్శించారు. శిబిరంలో ఏర్పాటు చేసిన ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన దాతలను, శిబిరాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు మరియు వాలంటీర్లను అభినందించారు.
 
ప్రజలను రక్తదానం వంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ, సమాజ సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్న నిర్వాహకులను సాయి దుర్గా తేజ్ ప్రశంసించారు.
 
పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు అభిమానుల సంబరాలకే పరిమితం కాకుండా, సామాజిక సేవ, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే కార్యక్రమాలకు వేదికగా నిలిచాయి.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
రాణి పద్మావతి పిరికిపందనా? నటి స్వర భాస్కర్‌పై బీజేపీ - కర్ణిసేన పైర్