1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Mysaa Postponed: Rashmika Mandanna's Film To Miss November 27 Release, New Date To Be Announced

మేకింగ్ నాణ్యతలో రాజీ లేదు.. అందుకే మైసా రిలీజ్ వాయిదా

Maisa song Rashmika mandanna
ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రను పోషించిన చిత్రం మైసా. ఈ చిత్రం ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్టు తొలుత మేకర్స్ ప్రకటించారు. అయితే, సినిమా మేకింగ్‌లో లోపాలు ఉన్నట్టు గుర్తించిన దర్శక నిర్మాతలు చిత్రం విడుదలను వాయిదా వేశారు. ఇదే విషయంపై మేకర్స్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
'తెలుగు సినిమా సాంకేతికంగా రోజురోజుకీ కొత్త ప్రమాణాలను సృష్టిస్తోంది. ఈ క్రమంలో ప్రేక్షకులకు అత్యుత్తమ థియేట్రికల్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో 'మైసా'ని భారీ యాక్షన్‌ చిత్రంగా రూపొందిస్తున్నాం. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, అనుకున్న స్థాయిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మూవీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తాం. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు. 'మైసా' రిలీజ్‌ కోసం ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉండదు' అని అందులో రాసుకొచ్చారు.
 
రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మైసా’. అన్‌ ఫార్ములా ఫిల్మ్స్‌ బ్యానెర్‌పై అజయ్, అనిల్‌ సయ్యపురెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్‌ సినిమాకు సంబంధించి ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. నవంబరు 27న రిలీజ్‌ కానున్న ఈ మూవీని.. వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
బాలీవుడ్ బిగ్ బి గొప్ప మనసు - సామాజిక కార్యకర్తకు రూ.21 లక్షల విరాళం