1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Devotee Gets Stuck Between Elephant Statue's Legs While Performing Ritual At MP's Amarkantak Temple; VIDEO Goes Viral

మొక్కు చెల్లించేందుకు వచ్చి ఏనుగు విగ్రహం కింద ఇరుక్కుపోయాడు (వీడియో)

devotee stuck elephant statue
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ఆలయంలో వింత ఘటన చోటుచేసుకుంది. మొక్కు చెల్లించుకునేందుకు ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు ఏనుగు విగ్రహం కింద ఇరుక్కునిపోయాడు. ఓ ఏనుగు విగ్రహం కింద దూరేందుకు ప్రయత్నించి గంటల తరబడి ఇరుక్కుపోయాడు. ఆ తర్వాత ఆలయ సిబ్బంది, తోటి భక్తులంతా కలిసి కొన్ని గంటల పాటు శ్రమించి ఆ భక్తుడుని రక్షించాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అమర్ కంఠక్‌లో ఉన్న ప్రసిద్ధి మా నర్మదా ఆలయంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ ఆలయంలోని ఏనుగు విగ్రహం కింద నుంచి వెళితే కోరికలు నెరవేరుతాయన్నది స్థానిక భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆచారంలో భాగంగానే ఓ భారీ పొట్టతో ఉన్న వ్యక్తి విగ్రహం కింద ఉన్న ఇరుకైన ప్రదేశంలో నుంచి దూరేందుకు ప్రయత్నించాడు. అయితే, మధ్యలోకి వెళ్లాక ముందుకు వెనక్కి కదలలేక అందులోనే ఇరుక్కుపోయాడు. 
 
ఆ  వ్యక్తి బయటకురాలేక ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన తోటి భక్తులు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎలా కదలాలో, శరీరాన్ని ఎలా వంపులు తిప్పాలో సూచనలు ఇస్తూ అతడిని బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. గంటల తరబడి శ్రమించిన తర్వాత అందరి సహాయంతో ఆ వ్యక్తి ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. గతంలోనూ కొందరు భక్తులు ఇలాగే విగ్రహం కింద ఇరుక్కుపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 

 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మృత్యువు పలుకరించి వెళ్లిపోయింది, ఆ ఐదుగురికి భూమి మీద నూకలున్నాయి, వీడియో