జీఎస్ఎల్వీ-F17, ఈఓఎస్-05 రాకెట్ల మోడల్స్‌తో తిరుమలలో ఇస్రో ఛైర్మన్ (video)
ISRO Chief Narayanan
పూజల అనంతరం, రంగనాయకుల మండపంలో వేద పండితుల నుండి వేదాశీర్వచనం అందుకున్నారు. ఆలయ అధికారులు ఆయనను పవిత్ర వస్త్రంతో సత్కరించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జీఎస్‌ఎల్వీ-ఎఫ్17, ఈఓఎస్-05 మిషన్ సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2:55 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించబడనుంది.
జీఎస్ఎల్వీ కేటగిరీలో ఇది 19వ రాకెట్ కావడం విశేషం. ఈ రాకెట్ ద్వారా నింగిలోకి ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని తీసుకెళ్లనున్నారు. జియో ప్లాట్‌ఫామ్‌పై ప్రయోగిస్తున్న తొలి భారతీయ ఉపగ్రహం ఈఓఎస్-05 అని నారాయణన్ తెలిపారు.
VIDEO | Tirumala, Andhra Pradesh: ISRO chief V Narayanan visits Tirumala temple ahead of the launch of Advanced Earth Observation Satellite-05 aboard GSLV-F17 on September 4.
— Press Trust of India (@PTI_News) September 2, 2026
(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/crFKHKqJUu
