మహిళలకు చట్టసభల్లో అవకాశం ఇవ్వకుంటే ఎలా? వెంకయ్య నాయడు
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం తెలుపకుండా లోక్‌సభలో అడ్డుకోవడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. మహిళలకు చట్టసభల్లో అవకాశం ఇవ్వకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఇవాళ కాకపోతే, రేపైనా ఈ బిల్లు అమల్లోకి వస్తుందన్నారు.
ఆంధ్రా యూనివర్శిటీ వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో శతాబ్ది వేడుకలు నిర్వహించారు. ఈ వారోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రతి వెంకయ్యన నాయుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం ఎంతో ముఖ్యమన్నారు. ఆధునిక సాంకేతికతను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మనం ఎపుడూ సామ్రాజ్యవాదన చేయలేదన్నారు.. కొన్ని దేశాలు సామ్రాజ్యవాదన ధోరణి వల్లే యుద్ధాలు వస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం సమాచారం సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇపుడు లక్షలాది కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకొని ఆలస్యం చేస్తున్నారు. మహిళలకు చట్టసభల్లో అవకాశం ఇవ్వకుండా ఉంటే ఎలా? బిల్లు ఇవాళ కాకపోతే.. రేపైనా అమల్లోకి వస్తుంది. ఆధునిక సాంకేతికతను విద్యార్థులు అందిపుచ్చుకోవాలి అని వెంకయ్యనాయుడు అన్నారు.
