1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Chhattisgarh teen dies hours after eating watermelon, 4 others fall sick

ఛత్తీస్‌గఢ్‌లో వివాహ వేడుకలో విషాదం- పుచ్చకాయ తిని బాలుడి మృతి

watermelon
watermelon
ఛత్తీస్‌గఢ్‌లో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి విందు ఫుడ్ పాయిజనింగ్ సంభవించి ఒక బాలుడు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం గుర్కోడ్ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులంతా తమ మేనమామ వివాహ వేడుకలో పాల్గొనేందుకు గుర్కోడ్ గ్రామానికి వచ్చారు. 
 
మధ్యాహ్నం 12 గంటల సమయంలో భోజనం చేసిన చిన్నారులు, ఆ తర్వాత పుచ్చకాయ ముక్కలు తిన్నట్లు సమాచారం. అయితే, తిన్న రెండు గంటలకే చిన్నారులందరికీ తీవ్రంగా వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. పరిస్థితి విషమించి శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు.
 
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అఖిలేశ్ ధివార్ అనే బాలుడు ప్రాణాలు విడిచాడు. మిగిలిన నలుగురు చిన్నారులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, వారు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. 
About Writer
సెల్వి