1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Chandrababu Naidu to Visit Cyclone-Hit Areas for Second Day

తుఫాను బాధిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన

Chandra Babu Naidu
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు, నరసాపురం మండలాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. తుపాను బాధితులను పరామర్శించేందుకు ఆయన వరుసగా రెండో రోజు పర్యటన చేపట్టనున్నారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం అమరావతి నుంచి బయలుదేరుతారు. మొగల్తూరు చేరుకున్నాక, ఆయన నవరాసపురం గ్రామంలో పంట నష్టాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి నష్టాల గురించి అడిగి తెలుసుకుంటారు.
 
 అలాగే, తుపాను ప్రభావిత గ్రామమైన మత్రేవును సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన సహాయక మరియు నరావాస శిబిరాన్ని పరిశీలిస్తారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన అక్కడ చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించడంతో పాటు, తుపాను వల్ల నష్టపోయిన ప్రజలతో నేరుగా మాట్లాడతారు. 
 
కాగా, గురువారం చంద్రబాబు నాయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం ప్రాంతంలో తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
మొబైల్ ఫోన్ వాడకం.. 14 ఏళ్ల కుమార్తెను హత్య చేసి.. ఉరేసిన తల్లి.. ఎక్కడ?