బిచ్చగాడికి రాఖీ కట్టిన అమ్మాయి: Samsung Galaxy ఫోన్ బహుమతి ఇచ్చాడు, వీడియో
రోడ్డుపై చింపిరి తలతో, చిరిగిపోయిన దుస్తులతో మాసిన గెడ్డంతో శరీరం అంతా దుమ్మూధూళితో ఓ బిచ్చగాడు రోడ్డుపై రాఖీ పట్టుకుని తిరుగుతున్నాడు. ఆ రాఖీని తనకు కట్టాల్సిందిగా దారినే వెళ్తున్నవారిని అభ్యర్థిస్తున్నాడు. చాలామంది అతడిని చూసి తప్పించుకుని వెళ్లిపోయారు. కానీ ఓ అమ్మాయి మాత్రం మానవతా దృక్పధంతో అతడి చేతిలోని రాఖీ తీసుకుని అతడి చేతికి కట్టింది. వెంటనే అతడు నవ్వుతూ Samsung Galaxy కొత్త ఫోనుని ఆమెకి బహుమతిగా ఇచ్చాడు. దాంతో ఆమెతో పాటు ఆమె పక్కనున్నవారు కూడా షాకయ్యారు. ఇదంతా ఓ వీడియోలో రికార్డు చేసారు.
అసలు సంగతి ఏమిటంటే... ఓ యువకుడు బిచ్చగాడి వేషం వేసుకుని సమాజంలో ఇలాంటి వారి పట్ల ఎంతమంది దయాగుణం చూపిస్తారు అని పరీక్షించేందుకే ఇలా చేసినట్లు చెప్పాడు. ఓ అమ్మాయి పేదవారి పట్ల ఎలాంటి వివక్ష లేకుండా మానవత్వంతో తనకు రాఖీ కట్టేందుకు ముందుకు రావడం తనను ఎంతగానో ముగ్ధుడ్ని చేసిందని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
वीडियो में दिख रहा लड़का भिखारी का रूप बनाकर राह चलती लड़कियों से राखी बंधवाने का नाटक करता है तभी एक लड़की ने बिना भेदभाव किए बिना उसे राखी बांध देती है
— Pramod Meena (@pramodDagal) August 28, 2026
उस लड़की की इस सादगी और इंसानियत से प्रभावित होकर लड़के ने उसे एक अच्छा फोन गिफ्ट किया
दरअसल वो लड़का यह देखना चाहता था कि… pic.twitter.com/IjNrHpayKu
