1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Effects of Depression on the Body

వ్యాపారం, ఉద్యోగం... పని... పని తీవ్రమైన ఒత్తిడి... వదిలించుకోవడం ఎలా...?

తీరికలేని బిజీ పనులు. అది వ్యాపారం కావచ్చు... ఉద్యోగం కావచ్చు. తీవ్రమైన ఒత్తిడులకు గురవుతున్నారు. శ్రమ అధికమవడంతో పాటు ఏదో సాధించాలనే తపన ఒక్కోసారి మానసిక స్థిమితం లేకుండా చేయడం, ఏదో జరిగిపోతున్నట్లు అనిపించడం, ఎంత ప్రయత్నించినా అందులోంచి బయటికి రాలే

Depression
తీరికలేని బిజీ పనులు. అది వ్యాపారం కావచ్చు... ఉద్యోగం కావచ్చు. తీవ్రమైన ఒత్తిడులకు గురవుతున్నారు. శ్రమ అధికమవడంతో పాటు ఏదో సాధించాలనే తపన ఒక్కోసారి మానసిక స్థిమితం లేకుండా చేయడం, ఏదో జరిగిపోతున్నట్లు అనిపించడం, ఎంత ప్రయత్నించినా అందులోంచి బయటికి రాలేకపోతున్నట్లుండటం, దీనికి తోడు ఆత్మన్యూనతాభావం, శారీరక సమస్యలు మరింత దిగజార్చుతాయి. ఇలాంటి పరిస్థితినే ఒత్తిడి అని చెప్పవచ్చు.
 
కొన్ని రకాల లక్షణాలను అంచనా వేసి లక్షణాల తీవ్రతను బట్టి డిప్రెషన్‌ను గుర్తించవచ్చు. అలాగే డిప్రెషన్ ఏ స్థాయిలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు నీరసం, చికాకు, నిరాశ, అభద్రతాభావం, అంతా శూన్యమైపోతున్నట్లుగా అనిపించడం, తప్పు చేస్తున్నట్లు మనసుకు అనిపిస్తుండటం, ఏకాగ్రత కోల్పోవటం, జ్ఞాపకశక్తి లోపం, చెడు జరుగుతుందేమోనని భయాందోళనకు గురి కావడం, ఇష్టపడుతున్న వాటిని అయిష్టపడటం వంటి మానసికపరమైన అంశాలు డిప్రెషన్‌ ఉందని చెప్పడానికి లక్షణాలు.
 
అలాగే డిప్రెషన్‌కు గురి అయినప్పుడు మానసికంగానే కాక, శరీర అవయవాల్లోను మార్పులు జరిగి శారీరక సమస్యలకు కూడా కారణం అవుతోంది. ఉదాహరణకు.. తలనొప్పి, తలతిరుగుట, అతిగా తినడం, పూర్తిగా తిండి మానెయ్యటం, అజీర్ణం, సరైన సమయానికి నిద్రపట్టకపోవటం, లేక అతిగా నిద్రపోతుండటం, తలనొప్పి, తలతిరగటం, శక్తి తగ్గి నీరసించటం, లేదా శారీరక రుగ్మతలు తగ్గకపోవటం వంటి లక్షణాలు తలెత్తుతాయి.
 
అయితే ఇందులోంచి బయటపడాలంటే కొన్ని సూచనలను పాటించక తప్పదు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం, పుస్తక పఠనం అలవాటు చేసుకోవటం, బాధ కలిగించే విషయాల నుంచి మనసును మళ్లించే ప్రయత్నం చేయటం, పిక్నిక్ వంటి వాటికి హాజరు కావటం, చిన్న విషయాల గురించి అనవసర ఆందోళనను వదిలిపెట్టడం, ప్రశాంత వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవడం, బ్రీథింగ్ వ్యాయామాలు చేస్తుండటం, తరుచు పిల్లలతో బయటకు వెళ్లి సరదాగా గడపటం, ఇష్టమైన పనులు చేయడం వంటివి చేస్తే దాదాపు డిప్రెషన్ నుంచి విముక్తులు కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
అది 50 రోగాలకు మందు... ఇది మీకు తెలుసా...?!!