శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 28 జూన్ 2017 (10:08 IST)

పురుషులకు గుడ్ న్యూస్.. వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొంటే గుండె పదిలం..

భాగస్వాములు ఉద్యోగాలు చేస్తుండటం.. హడావుడిగా పరుగులు తీయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. దంపతుల మధ్య పలకరింపులు కూడా ఫోన్లకే పరిమితమవుతోంది. ఇంటికొచ్చినా.. మళ్లీ ఏదో పనిలో పడి హడావుడిగా గడిపేస్తున్న దంపతు

భాగస్వాములు ఉద్యోగాలు చేస్తుండటం.. హడావుడిగా పరుగులు తీయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. దంపతుల మధ్య పలకరింపులు కూడా ఫోన్లకే పరిమితమవుతోంది. ఇంటికొచ్చినా.. మళ్లీ ఏదో పనిలో పడి హడావుడిగా గడిపేస్తున్న దంపతుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. అయితే ఎన్ని పనులున్నా వారానికి రెండుసార్లు మాత్రం శృంగారంలో తప్పక పాల్గొనాల్సిందే అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే..? వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొనడం ద్వారా గుండెను పదిలం చేసుకోవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. 
 
శృంగారం వలన రక్తంలోని హానికారక రసాయనాల స్థాయి తగ్గుతుందని పరిశోధనలో వెల్లడించింది. ఫలితంగా జీవితాన్ని భయపెట్టే గుండె సంబంధ సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని వివరించింది. అధ్యయనకారుల ప్రకారం.. వారంలో పలుమార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల పురుషుల్లో రక్త సరఫరా మెరుగవుతుంది. రక్తనాళాలు దృఢంగా తయారవుతాయి. 
 
అన్నింటికంటే ముఖ్యంగా ప్రాణాలకు ముప్పుగా పరిణమించే హోమోసిస్టీన్ అనే రసాయనం రక్తంలో పెరగకుండా శృంగారం అడ్డుకుంటుందని పరిశోధనలో వెల్లడైంది. అయితే ఈ విషయంలో మహిళలకు మాత్రం అంత ప్రయోజనం ఉండదని అధ్యయనకారులు తెలిపారు. ఎందుకంటే వారిలో ఆరోగ్యకరమైన రక్త సరఫరాపై శృంగార ఉద్దీపనలు అంతగా ఆధారపడి ఉండవని తెలిపారు.