1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Green tea, lemon juice health benefits

రోజుకు 2 కప్పుల గ్రీన్ టీ, గ్లాసుడు నిమ్మరసం.. అల్లరసం తీసుకుంటే?

శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటికి పంపాలా.. అయితే ఈ టిప్స్ పాటించండి. డిటాక్సిఫికేషన్ ద్వారా లివర్‌ను కాపాడుకోవచ్చు. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గ్రీన్ టీ డిటాక్సిఫికేషన్‌కు బాగా పనిచేస్తుంది. ఎముకల్

Green tea
శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటికి పంపాలా.. అయితే ఈ టిప్స్ పాటించండి. డిటాక్సిఫికేషన్ ద్వారా లివర్‌ను కాపాడుకోవచ్చు. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గ్రీన్ టీ డిటాక్సిఫికేషన్‌కు బాగా పనిచేస్తుంది. ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది. ఇందులో యాంటీ ఏజింగ్‌ గుణాలుంటాయి. బ్లడ్‌షుగర్‌ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. రోజూ ఒక కప్పు లేక రెండు కప్పులు గ్రీన్‌ టీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు. 
 
* నిమ్మరసం : శరీరంలోని వ్యర్థపదార్థాలు బయటకు పంపడంలో నిమ్మరసం బాగా సహాయపడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం నిగారింపు వచ్చేలా చేస్తుంది. బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది. నోటి దుర్వాసనను అరికడుతుంది. రోజూ ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయ రసం కలుపుకుని తాగితే చాలు.
 
* అల్లం : ఇందులో ఆరోగ్య సమస్యలపై పోరాటాన్ని చేసే విటమిన్స్‌ లభిస్తాయి. యాసిడ్‌ రిఫ్లెక్స్‌ సమస్యను తగ్గించడమే కాకుండా గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. అల్లం ముక్కలను నీటిలో మరిగించి తాగితే సరిపోతుంది. అల్లం పొడిని గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగినా ఫలితం ఉంటుంది.
తర్వాతి కథనం
కొబ్బరి నీళ్లు పరిమితికి మించి తీసుకుంటే క్యాన్సర్ తప్పదట!