శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2016 (17:47 IST)

కొబ్బరి నీళ్లు పరిమితికి మించి తీసుకుంటే క్యాన్సర్ తప్పదట!

కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల నష్టాలు కూడా కలుగుతాయి. కొబ్బరిలో తక్కువ శాతం కొవ్వు ఉంటుంది. అంతేకాదు.. కొబ్బరి నీటిలో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల..

కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల నష్టాలు కూడా కలుగుతాయి. కొబ్బరిలో తక్కువ శాతం కొవ్వు ఉంటుంది. అంతేకాదు.. కొబ్బరి నీటిలో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల.. రోజంతా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి తోడ్పడుతుంది.
 
నీరసంగా అనిపించినప్పుడు కొబ్బరినీళ్లు తాగమని నిపుణులు సూచిస్తారు. కొబ్బరినీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. వీటిని మోతాదుకు మించి సేవించడం వల్ల కండరాల నొప్పి, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి.
 
కొబ్బరినీళ్లలో ఎక్కువ లాక్సేటివ్ ఉంటుంది కాబట్టి... వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల.. డయేరియా, వికారం, వాంతులు, పొత్తికడుపు నొప్పికి కారణమవుతాయి. కొబ్బరినీళ్లలో డ్యూరెటిక్ గుణాలుంటాయి. ఇవి యూరినేషన్‌ని పెంచుతాయి. పరిమితికి మించి తాగితే తరచుగా యూరినేషన్ వెళ్లాల్సి వస్తుంది.
 
కొబ్బరినీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. కానీ.. దగ్గు, జలుబు చాలా తరచుగా, వెంటనే వచ్చే అవకాశాలున్నాయంటే.. కొబ్బరినీళ్లు తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరినీళ్లలో సోడియం చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి.. ఇది క్యాన్సర్‌కి కారణమవుతుంది. అందుకే..పరిమితికి మించి కొబ్బరినీళ్లు తీసుకోకూడదు.