1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Health benefits of beetroot

బీట్ రూట్ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటు మటాష్..

సౌందర్యానికి బీట్ రూట్‌ అద్భుతంగా పనిచేస్తుందట. విటమిన్‌ బి ఉండే బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడారకుండానూ చూస్తుంది. వీటిల్లోని బీటేన్‌ రక్త

Beetroot
సౌందర్యానికి బీట్ రూట్‌ అద్భుతంగా పనిచేస్తుందట. విటమిన్‌ బి ఉండే బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడారకుండానూ చూస్తుంది. వీటిల్లోని బీటేన్‌ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది. 
 
రోజుకి ఓ చిన్న గ్లాసుడు బీట్‌రూట్‌ రసం తాగితే రక్తపోటు తగ్గటానికి దోహదం చేస్తుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది. 
 
ఇంకా గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది. బీట్‌రూట్‌లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్‌ ఆక్సైడ్‌లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.
 
బీట్‌రూట్‌ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటును నియంత్రిస్తుంది. దీనివల్ల అనవసర ఆందోళనను దూరం చేసుకోవచ్చు.
About Writer
chitra
తర్వాతి కథనం
బరువు తగ్గాలని ఇబ్బందులు తెచ్చుకోవద్దు.. ట్రెడ్ మిల్ వద్దే వద్దు..