1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Here's why you shouldn't drink soft drink on an empty stomach

పరగడుపున కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? ఆమ్లాలతో కష్టాలే..

పరగడుపున శీతల పానీయాలు తీసుకోవడం.. కూల్ డ్రింక్స్‌ను తాగడం వంటివి చేస్తే.. అందులోని ఆమ్లాలతో వికారం, వేవిళ్లు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆమ్లాల ప్రభావం జీర్ణాశయంపై పడుతుందని వారు సూచ

soft drink
పరగడుపున శీతల పానీయాలు తీసుకోవడం.. కూల్ డ్రింక్స్‌ను తాగడం వంటివి చేస్తే.. అందులోని ఆమ్లాలతో వికారం, వేవిళ్లు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆమ్లాల ప్రభావం జీర్ణాశయంపై పడుతుందని వారు సూచిస్తున్నారు. అలాగే పండ్లు కూడా పరగడుపున తీసుకోకూడదు. ముఖ్యంగా అరటిపండ్లు తీసుకోవడం వద్దు. అరటిలోని మెగ్నీషియం ఉదయం పూట ఎక్కువ మోతాదులో శరీరానికి అందటం మంచిదికాదు. 
 
చాలామంది ఉదయం నిద్రలేవగానే కాఫీ, టీ లను తాగుతుంటారు. ఉదయం వాటిని తాగడం మంచిదే అయినా పరగడుపున తాగడం మంచిది కాదని, ఈ విధంగా తాగడం వల్ల హార్మోన్లు అన్‌ బ్యాలెన్స్‌ అవుతాయి. గ్లాస్ నీటిని తాగితే తర్వాతే కాఫీలు, టీలు తాగడం మంచిది. 
 
ఘాటైన మసాలా కూరల్ని పరగడుపున తినకూడదు. అలా తింటే పొట్టలో తిప్పడమే కాక రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది. ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే అల్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఉదయం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
About Writer
Selvi
తర్వాతి కథనం
మహిళలు నెలసరి రోజుల్లో ఒక గ్రాము అల్లం పొడిని తీసుకుంటే?