సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 19 జూన్ 2020 (21:03 IST)

ఉపవాసం చేయడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుందా? (video)

ఉపవాసాన్ని ప్రతి ఒక్కరు ఏదో ఒక కోరికతో చేస్తారు. తనకు వచ్చిన ఆపదను తొలిగించమని మన ఇష్టదేవతలను కోరుకుంటాము. ఆ కోరిక తీరితే ఉపవాసం ఉంటామని మొక్కుకుంటాము. కాని ఉపవాసం వలన మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
 
మెదడు పనితీరు మెరుగుపడి మనిషి బుద్ధిజీవిగా జీవిస్తాడు. ఆరోగ్యానికి నాడీకణాల ఉత్పత్తిలో సాయిపడే ప్రోటీన్ ఉపవాసం వలన ఉత్తేజితమై అల్జీమర్, డిమెన్షియా, డిప్రెషన్ వంటి వ్యాధుల బారి నుండి మనల్ని కాపాడుతుంది. మనం ఆకలి వేసినా వేయకపోయినా ఏదొక ఆహారం తీసుకుంటునే ఉంటాము. దీని వలన ఆకలివేస్తుందని తెలిపే హార్మోను ఘెర్లిన్, సరైన సమాచారాన్ని మెదడుకు అందించలేదు. దీని వలన మన జీర్ణ వ్యవస్థ దెబ్బతిని, గ్యాస్, ఒబిసిటి వంటి రోగాల బారిన పడతారు. వారానికి ఒకసారి ఉపవాసము ఉండటం వలన ఎంతో అవసరం అంటారు నిపుణులు.
 
ఇలా చేయండ వలన ఆకలి వేస్తుంది. కాలేయం పనితీరు చక్కగా వుంటుంది. ఉపవాసం ఉండటం వలన మన శరీర సౌందర్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియకు విశ్రాంతి దొరకినందున చచ్చిపోయిన లేదా పాడైపోయిన కణజాలాన్ని బాగు చేసుకోవడానకి, రక్తాన్ని శుభ్రం చేసుకోనడానికి సమయం దొరుకుతుంది.
 
దీని వలన వృధ్ధాప్య ఛాయలు దగ్గరకు రావు. అంతేకాకుండా కీళ్ళలో పేరుకుపోయిన, కొవ్వు, నీరు వంటి మాలిన్యాలు తొలిగిపోతాయి. ఫలితంగా కీళ్ళ బాధలు తగ్గుతాయి. ఉపవాసము వారానికి ఒక్కసారి, లేదా నెలకు రెండుసార్లు మాత్రమే ఉండాలి. అదేపనిగా ఉపవాసాలు చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. బలహీనంగా ఉన్నవారు గుండెజబ్బులు కలవారు ఉపవాసాలు చేయకూడదు.