గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 జూన్ 2020 (17:38 IST)

అరటి తొక్కతో అంత మేలా? చర్మం మెరిసిపోతుందట.. తెలుసా?

అరటి తొక్కను ఉడికించిన నీటిని తాగినా లేదా రసం తీసి తాగినా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. సాయంత్రం పూట అరటి తొక్క ఉడికించిన నీటిని రోజూ సాయంత్రం వేళల్లో తీసుకోవచ్చు. అరటి తొక్కల్లో ఉండే యాంటీఆక్సిడెంట్... ల్యూటిన్ కళ్ళకి పోషకాలను అందిస్తుంది. అరటిపండు తొక్కల్లో మన భావోద్వేగాలను నియంత్రించే ''సెరిటోనిన్'' నిల్వలు అధిక మొత్తంలో ఉంటున్నాయని వైద్యులు చెప్తున్నారు. 
 
అరటి తొక్కలో ఉండే కొన్ని రసాయన స్రావాలు కంటి రెటీనా కణాల్ని పునరుజ్జీవింప చేస్తున్నాయని గుర్తించారు. సాధారణంగా మెదడులో సెరిటోనిన్ నిల్వలు తగ్గితే మనకు డిప్రెషన్ సంప్రాప్తిస్తుంది. సాధారణంగా మెదడులో సెరిటోనిన్ నిల్వలు తగ్గితే ఒత్తిడి తప్పదు. ఇది తగ్గకుండా చూసుకోవడానికి అరటితొక్కలను ఆశ్రయించవచ్చునని పరిశోధకులు చెప్తున్నారు.
 
అరటి తొక్కతో ప్రత్యేకించి చర్మ సౌందర్యాన్నికాపాడుకోవచ్చు. ఎలాగంటే.. కాలుష్యం, సూర్యకాంతి, దుమ్ము, ధూళి, తీసుకునే ఆహారం… ఇవన్నీ మన చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దాంతో చర్మం నల్లగా మారుతుంటుంది. అలాంటప్పుడు అరటిపండు తొక్క ఈ సమస్యలను తగ్గించి చర్మాన్ని మెరిపిస్తుంది.
 
అరటిపండు తొక్క, కొద్దిగా వంటసోడా, కాసిని నీళ్లు మిక్సీలో తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పూతలా రాసుకోవాలి. పదినిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం పై మృత కణాలు తొలగిపోతాయి. ముఖచర్మం తాజాగా, కోమలంగా మారుతుంది.
 
అరటిపండు తొక్కను మెత్తగా చేసుకోవాలి. దీనికి చెంచా కలబంద గుజ్జును కలపాలి. ఈ మిశ్రమాన్ని కంటి చుట్టూ రాసి… పదినిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. వారంలో నాలుగుసార్లు ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు మాయమవుతాయి.. అంతే కాదు.. వాపు సమస్య తగ్గిపోతుంది. జిడ్డు చర్మం ఉన్నవారు ఈ పూతను ప్రయత్నిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.