1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Should you eat rice curd at night?

రాత్రిపూట పెరుగు లేదా పెరుగన్నం తినవచ్చా?

పెరుగు వల్ల జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మంచి బాక్టీరియా జీర్ణాశయానికి, పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా కూడా మారుతాయి.

curd rice
పెరుగు వల్ల జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మంచి బాక్టీరియా జీర్ణాశయానికి, పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా కూడా మారుతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది. అందుకే చాలా మంది పెరుగన్నాన్ని మూడు పూటలా ఆరగిస్తుంటారు. అయితే, రాత్రి పూట పెరుగన్నం తినవచ్చా? లేదా? అనే సందేహం చాలా మందిని వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే.. రాత్రిపూట పిల్లలు పెరుగన్నం అడిగితే పెట్టరు. జలుబు చేస్తుందని, దగ్గు వస్తుందని చెపుతారు. వాస్తవానికి రాత్రి పూట పెరుగున్న తినవచ్చా? లేదా? అనేదాన్ని ఇపుడు పరిశీలిద్ధాం. 
 
శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. అయితే పెరుగును రాత్రిపూట తినడం వల్ల మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో కఫం వస్తుంది. తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది మంచిది కాదు. ఇలాంటి వారు పెరుగన్నం ఆరగించకుండా ఉండటమే ఉత్తమం. దగ్గు, జలుబు సమస్య లేని వారు రాత్రి పూట నిర్భయంగా పెరుగు లేదా పెరుగన్నం ఆరగించవచ్చు. 
 
ఇక దగ్గు, జలుబు సమస్య ఉన్నవారు పెరుగును మధ్యాహ్నం పూట తినవచ్చు. దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే వారు కొద్దిగా చక్కెర లేదా మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకుని తినడం ఉత్తమం. దీంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు దరిచేరవు. 
About Writer
pnr
తర్వాతి కథనం
ట్రంప్ దెబ్బ... అమెరికాను వదిలేయండి... సింగపూర్ వెళ్లండి...