1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Sitting for Hours May Raise Type 2 Diabetes Risk

ఆఫీసుల్లో అదేపనిగా కూర్చోకండి.. మధుమేహంతో పాటు గుండెజబ్బులు తప్పవ్

ఆఫీసుల్లో అదేపనిగా ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు మధుమేహంతో పాటు గుండెజబ్బుల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం లాంటివి మధుమేహం బారిన పడేందు

Sitting
ఆఫీసుల్లో అదేపనిగా ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు మధుమేహంతో పాటు గుండెజబ్బుల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం లాంటివి మధుమేహం బారిన పడేందుకు ప్రధాన కారణాలని ఈ అధ్యయనం చెబుతోంది. 
 
వీటన్నింటితో పాటు రోజువారీ జీవన విధానం కూడా మధుమేహం ముప్పు పెరిగేందుకు కారణాలుగా ఉంటున్నాయని పరిశోధకులు అంటున్నారు. దీనికోసం ప్రతిరోజూ ఉదయం లేవగానే అరగంటపాటు వ్యాయామం చేసేవారు ఇకపై తమ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదని అనుకుంటుంటారుగానీ... నిజానికి రోజంతా ఒళ్లు కదల్చకుండా కూర్చోవడం వల్ల కలిగే నష్టాన్ని ఈ అరగంట వ్యాయామాలు ఏమాత్రం భర్తీ చేయలేవని వారు చెబుతున్నారు.
 
గంటలతరబడీ అదేపనిగా కూర్చొని పని చేసుకుంటుండేవారు ఎక్కువసేపు కూర్చోకుండా... వీలైనప్పుడల్లా సీట్లోంచి లేచి, అటూ ఇటూ తిరగడం.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ ఆఫీసు కారిడార్లలో పచార్లు చేయడం లాంటివి చాలా మేలు చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
 
About Writer
chitra
తర్వాతి కథనం
సజ్జ రొట్టెలు, రాగిజావలను కనీసం వారానికి నాలుగు సార్లైనా తీసుకోండి...