1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Suganr cane juice for health

చెరకు రసాన్ని వేసవిలో తాగితే..?

Sugar cane
చెరకు రసాన్ని పిల్లలు, పెద్దలూ తేడా లేకుండా చాలా ఇష్టపడతారు. ఇది సహజసిద్ధంగా లభించే తియ్యని రసం. వేసవిలో చెరకు రసాన్ని త్రాగడం వల్ల శరీర ఆరోగ్య రీత్యా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. చెరకు రసంలో శరీరానికి అవసరమయ్యే మినరల్స్, విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. 
 
బరువును నియంత్రించడంలో కూడా ఇది తోడ్పడుతుంది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఈ జ్యూస్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని కొంత మంది భావిస్తారు. కానీ ఇటువంటప్పుడు ఒక గ్లాస్ చెరకు రసం తాగడం వల్ల ఈ జబ్బుల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. వేసవిలో ప్రతిరోజు ఒక గ్లాసు చెరకురసం త్రాగటం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. 
 
క్రోమియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. వాటితోపాటు ఐరన్, ఫోలిక్ యాసిడ్‌లు ఎక్కువగా ఉన్న ఈ చెరకు రసం బాలింతలు తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. చెరకులో కాల్షియం ఉండటంతో ఎముకలు దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చిన్నపిల్లల ఎదుగుదలకు చెరకురసం చక్కగా దోహదపడుతుంది. 
 
బరువు తగ్గాలనుకునే వారికి చెరకురసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ రెండు పూటలా ఒక గ్లాసు చెరకు రసంలో అరచెక్క నిమ్మరసాన్ని కలిపి త్రాగండి. వ్యాధి నిరోధక శక్తిని పెంచి, తీవ్ర జ్వరం, మాంసకృత్తులు లోపించడం వంటి సమస్యల నుంచి పిల్లలను ఈ రసం కాపాడుతుంది. మూత్రపిండాలలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి చెరకురసం మంచి ఔషధం.
About Writer
సందీప్
తర్వాతి కథనం
మల్లె పువ్వుల టీని తీసుకుంటే అధిక రక్తపోటు మటాష్