1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. The Effect of Alcohol on Hormones and Their Function

మద్యపానంతో పురుషత్మ హార్మోన్లకు దెబ్బ.. ఎముకలకు ముప్పే!

మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఇది అందరికి తెలిసిందే. కాని మద్యపానం సేవించడం వల్ల పురుషత్వ హార్మోన్లు కూడా దెబ్బతింటాయట. మానసిక, శారీరక ఒత్తిడి టెస్టోస్టీరాన్ స్థాయిని పూర్తిగా నాశనం చేస్తుంది. అకస్మాత్

Effect
మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఇది అందరికి తెలిసిందే. కాని మద్యపానం సేవించడం వల్ల పురుషత్వ హార్మోన్లు కూడా దెబ్బతింటాయట. మానసిక, శారీరక ఒత్తిడి టెస్టోస్టీరాన్ స్థాయిని పూర్తిగా నాశనం చేస్తుంది. అకస్మాత్తుగా కార్టిసాల్ పెరగడానికి ఒత్తిడి కూడా ఒక విధంగా కారణమవుతుంది. ఇది టెస్టోస్టీరాన్‌ను తయారుచేసే కణజాలంలో ఉపయోగించే శరీర శక్తిని కుంగదీస్తుంది.
 
పూటుగా మద్యం తాగే వారిలో హార్మోన్స్‌ ఉత్పత్తి కావడం తగ్గిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. మద్యపానం వల్ల ఆరోగ్యానికి పెను ముప్పు వాటిల్లుతుంది. మద్యపానం వల్ల రక్తపోటుతో పాటు గుండెపోటు కూడా వచ్చే ప్రమాదముంది. దీనివల్ల ఎముకలు కూడా బలహీనపడటం వంటివి కూడా జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి సేవిస్తే తప్పులేదు కాని మోతాదుకు మించి సేవించడం ఆరోగ్యానికి మంచిదికాదని వారంటున్నారు.
About Writer
chitra