1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Weight loss tips

బరువు తగ్గాలా..? స్నాక్‌గా ఆపిల్‌తో పాటు నల్ల మిరియాలు- నిమ్మరసం తీసుకోండి

నల్ల మిరియాలు- నిమ్మరసాన్ని తీసుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. నల్లమిరియాలలో సహజసిద్ధంగా పైపరీన్‌ అనే రసాయనం ఉంటుంది. మిరియాల ఘాటుకి కారణం ఈ రసాయనమే. ఇది రక్తంలోని కొవ్వ

Weight loss tips
నల్ల మిరియాలు- నిమ్మరసాన్ని తీసుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. నల్లమిరియాలలో సహజసిద్ధంగా పైపరీన్‌ అనే రసాయనం ఉంటుంది. మిరియాల ఘాటుకి కారణం ఈ రసాయనమే. ఇది రక్తంలోని కొవ్వు స్థాయిని తగ్గించి, కొవ్వుకణాలు ఉత్పత్తికి అడ్డుపడి, ఆహారం నుండి పోషకాలను శోషించుకోవడంలో సాయపడుతుంది. ఇక నిమ్మరసం జీర్ణక్రియకి సాయపడుతుంది. 
 
ఈ కషాయం తయారీకి కొద్దిగా నల్లమిరియాల పొడి, అరచెక్క నిమ్మరసం, మంచినీళ్లు కావాలి. నిమ్మరసాన్ని నీళ్లలో కలిపి ఆ తరువాత నల్లమిరియాల పొడి వేయాలి. ఈ రసాన్ని ప్రతిరోజూ భోజనం తరువాత తాగితే మంచి ఫలితం ఉంటుంది. 
 
అలాగే రోజుకో యాపిల్‌ తింటే అధికబరువు సమస్యకు దూరంగా ఉండొచ్చు. యాపిల్‌లో పుష్కలంగా పోషకాలు ఉండడమే కాకుండా బరువు తగ్గించేందుకు సాయపడే ఎన్నో గుణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది పీచుపదార్థాన్ని కలిగి ఉండడం. ఇది ఆకలిని తగ్గిస్తుంది. స్నాక్స్‌ ఏవైనా తినాలనిపించినప్పుడు ఒక యాపిల్‌ తింటే సరిపోతుంది. ఇక రెండోది రక్తంలో చక్కెరస్థాయిని, ఆకలిని, శక్తిస్థాయిలను క్రమబద్ధం చేస్తుంది.
About Writer
Selvi
తర్వాతి కథనం
భోజనం తర్వాత ఓ ముక్క డార్క్ చాక్లెట్ తింటే..? స్పూన్‌తో తినండి.. ముద్దకీ ముద్దకీ