1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. What actually happens when you drink alcohol ...?

మద్యం తాగినప్పుడు అసలేం జరుగుతుందంటే...?

drink
మనం ఆల్కహాల్‌ తాగినప్పుడు అది కేవలం సెకన్ల వ్యవధిలో మెదడుకు చేరడం మొదలవుతుంది. మద్యం తాగడం మొదలుపెట్టాక కేవలం ఆరు నిమిషాల్లో మెదడు కణాల్లోకి వెళ్తుంది. ఆ వెంటనే మన మెదడులోంచి డోపమైన్‌ అనే సంతోష రసాయనాలు బయటికి వస్తాయి. అవి మెదడును తాత్కాలికంగా ఉత్తేజపరుస్తాయి. దాంతో ఒకరకమైన ఆనందం, ఆహ్లాదం, హాయిగా తేలిపోతున్న అనుభూతులు కలుగుతాయి.
 
ఉదాహరణకు కొన్నివాస్తవాలు
జీర్ణకోశ వ్యవస్థ: మద్యం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. గ్యాస్ట్రయిటిస్, కడుపులో పేగులో పుండ్లు (అల్సర్స్‌), అరుగుదలలో లోపాలు, జీర్ణమైన ఆహారం ఒంటికి పట్టడంలో లోపాలు (మాల్‌ అబ్జార్‌ప్షన్‌ సిండ్రోమ్‌), క్యాన్సర్లు, హీమరాయిడ్స్, కాలేయం దెబ్బతినడం, పాంక్రియాస్‌ గ్రంథి సమస్యలు కనిపిస్తాయి. 75% ఈసోఫేజియల్‌ క్యాన్సర్లకు కారణం మద్యం తాగడమే.
♦ గుండె: ఆల్కహాల్‌ కార్డియోమయోపతి (గుండె కండరం పెరగడం), గుండె స్పందన, లయల్లో మార్పులు. గుండెపోటు, అథెరోస్లీ్కరోసిస్‌ సమస్యలు.
♦ నాడీ వ్యవస్థలో లోపాలు: జ్ఞాపకశక్తిలోపం, అనేక మానసిక వ్యాధులకు లోనుకావడం, స్పర్శ కోల్పోవడం, తిమ్మిర్లు, పక్షవాతం వంటి సమస్యలు రావచ్చు.
♦ సెక్స్‌ సమస్యలు: సామర్థ్యం తగ్గడం, అంగస్తంభన సమస్యలు రావచ్చు.
♦ గర్భిణులు ఆల్కహాల్‌ తాగడం వల్ల పుట్టబోయే పిల్లలకు బుద్ధిమాంద్యం, అవయవాలు సరిగ్గా ఎదగకపోవడంతో అనేక వైకల్యాలు కనిపించవచ్చు.
♦ మద్యం తాగినప్పుడు ఆకలి మందగించడంతో సరిగ్గా ఆహారం తీసుకోరు. అది అనేక విటమిన్‌ లోపాలకు కారణం అవుతుంది.
♦ ప్రమాదాలు: మద్యం వల్ల వ్యక్తి విచక్షణ, అంచనావేసే శక్తిని కోల్పోతాడు. అది చురుకుదనాన్ని తగ్గిస్తుంది. వాహన ప్రమాదాల్లో దాదాపు 90 శాతం మద్యం తాగి డ్రైవ్‌ చేసినప్పుడు అయ్యేవే. మద్యం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువే కాకుండా, ప్రాణాపాయ అవకాశాలు కూడా ఎక్కువ. ఈ ప్రమాదాల్లో బతికినప్పటికీ ఒక్కోసారి తలకు తీవ్రమైన గాయాల వల్ల జీవితాంతం వైకల్యంతోనే జీవించాల్సి వచ్చే అవకాశాలే ఎక్కువ 
About Writer
ఎంజీ
తర్వాతి కథనం
వేగంగా బరువు తగ్గటానికి మీ ఇంట్లోనే ఇలా...!