1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (19:42 IST)

రక్తపోటుకి టీ తాగడానికి లింక్ వుందా? (video)

చాలామంది ఉదయాన్నే తేనీరు సేవిస్తుంటారు. మరికొందరు కమ్మని కాఫీ తాగి తమ దినచర్యలను ప్రారంభిస్తారు. టీ, కాఫీలు తాగేవారికి బీపీ వచ్చే అవకాశం తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
ఫ్రాన్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు టీ ఎక్కువగా తాగేవారిలో తక్కువ తాగేవారిలోకంటే బీపీ, నాడి, గుండెకు సంబంధించిన వ్యాధులు తక్కువగా ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపారు. రోజుకు కనీసం 4 కప్పుల టీ లేదా కాఫీ తీసుకునేవారికి అసలు ఏమీ తాగని వారికంటే బీపీ తక్కువగా ఉందని తాము నిర్వహించిన 10 యేళ్ళ పరిశోధనలో వెల్లడైనట్టు తెలిపారు. 
 
ఇందుకోసం 16 నుంచి 95 ఏళ్ల మధ్య వయస్సున్న సుమారు 1,76,437 మంది స్త్రీ, పురుషులపై అధ్యయనం నిర్వహించి ఈ ఫలితాలను వెల్లడించారు. తేనీరులో ఉండే కొన్ని రకాలైన పదార్థాలు మన రక్తనాళాలపై ప్రభావాన్ని చూపడం వల్ల ఇలా బీపీ తక్కువగా ఉండటానికి కారణమవుతున్నట్టు తెలిపారు.