గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , బుధవారం, 15 సెప్టెంబరు 2021 (10:42 IST)

సీఎం జ‌గ‌న్ మాట తప్పరు... ఎల్ పిటి, డిఈడి షెడ్యూల్ పై ధర్మాన హామీ

ed 2018 -19,  2019 -20 ఎల్ పిటి మరియు  డిఈడి మేనేజ్మెంట్, స్పాట్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు తక్షణమే పరీక్షల షెడ్యూల్ ప్రకటించాలని  ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పండిట్ ట్రైనింగ్ కాలేజ్ మేనేజ్మెంట్  అసోసియేషన్  డిమాండు చేస్తోంది. దీనిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పాజిటివ్ గా స్పందించారు. మానవతా దృక్పథంతో వ్యవహరిస్తామని, ముఖ్యమంత్రి జ‌గ‌న్ ఒకసారి మాట ఇచ్చారంటే,  తప్పేది లేదని ఆయన వ్యాఖ్యానించారు.
 
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పండిట్ ట్రైనింగ్ కాలేజ్ మెంట్ అసోసియేషన్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రత్యేకంగా కోరారు. దీంతో ధర్మాన కృష్ణదాస్ అనుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రితో కూడా తక్షణమే మాట్లాడుతామని,  ఇది వేలాది మంది విద్యార్థులతో కూడిన భవిష్యత్తు సమస్య అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా హామీ ఇచ్చారని, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు  ఆదేశాలు జారీ చేశారని  అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు.
 
పది నెలలు గడుస్తున్నప్పటికీ విద్యాశాఖ నుంచి ఇంతవరకు స్పందన లేదని, షెడ్యూలు కూడా ప్రకటించ లేదని వారు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఎంతో ఆందోళన చెందుతున్న విషయాన్ని ఉప ముఖ్యమంత్రి దృష్టికి బాలచంద్రుడు, ఇతర ప్రతినిధులు తెచ్చారు. ఉప ముఖ్యమంత్రిని  కలిసిన వారిలో అసోసియేషన్ అధ్యక్షుడు బాల చంద్రుడు మరియు  విజేత శ్రీనివాస్ ,చెంచయ్య, సాయి శంకర్ ,మోసిన్ ,కోట ప్రసాద్ తో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు ఉన్నారు .