గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (10:58 IST)

విద్యా సంస్థలకు సెలవు - పరీక్షలు వాయిదా

తెలంగాణా రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం జరగాల్సిన పరీక్షలను వాయిదావేశారు. అలాగే, విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. ఈ విషయాన్ని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వెల్లడించారు. 
 
మరోవైపు, శ్రీరాం సాంగర్ ప్రాజెక్టుకు చెందిన 30 గెట్లను ఎత్తివేసి 1.96 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగివున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది.