గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (15:08 IST)

కోడికి మసాలాలు పూసి వేలాడదీసినట్టుగా కేసీఆర్ పథకాలు.. ఎవరు?

వరంగల్ జిల్లాలో జరుగుతున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ ర్యాలీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పథకాలు.. కోడికి మసాలాలు పూసి వేలాడదీసినట్టుగా ఉంటాయని ఎద్దేవా చేశారు. అలాంటి కోడిని చూడటమే తప్ప.. తినలేమని, కేసీఆర్ పథకాలు కూడా చెప్పుకోవడానికి తప్ప అమలుకు నోచుకోవని ఎద్దేవా చేశారు.
 
కేసీఆర్ ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండిపోరని.. కొందరు పోలీసు అధికారులు ఆ విషయాన్ని గమనించి విధులు నిర్వహించాలన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. వరంగల్‌లో ఇబ్బంది పెడుతున్న అధికారుల పేర్లు రాసి చేసి పెట్టుకోవాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామని వ్యాఖ్యలు చేశారు.