1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Carrott pack for foot health

అరికాళ్ళు మృదువుగా ఉండాలంటే.. క్యారెట్ ప్యాక్ వేసుకోండి.

అరి కాళ్ళు మృదువుగా ఉండాలంటే తరచూ వాటిని కొబ్బరినూనెతో మర్దనా చేస్తుండాలి. మోకాళ్లు నల్లగా ఉంటే బాగుండదు. అందుకు కమలాపండు ముద్దలా చేసి కొబ్బరినూనెలో అరగంట పాటు నానబెట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్‌‌లా వేయాల

Carrott pack for foot health
అరి కాళ్ళు మృదువుగా ఉండాలంటే తరచూ వాటిని కొబ్బరినూనెతో మర్దనా చేస్తుండాలి. మోకాళ్లు నల్లగా ఉంటే బాగుండదు. అందుకు కమలాపండు ముద్దలా చేసి కొబ్బరినూనెలో అరగంట పాటు నానబెట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్‌‌లా వేయాలి. తర్వాత శనగపిండి, పాలు, తేనె ఒక్కో చెంచాడు చొప్పున కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్ల కు పట్టించి ఆరాక కడిగేయాలి.
 
అరికాళ్ళు మృదువుగా ఉండాలంటే.. క్యారెట్‌ తురుమునకు రెండు టేబుల్‌ స్పూన్ల గ్లిజరిన్‌ చేర్చి ప్యాక్‌లా వేసుకుంటే సరిపోతుంది. అలాగే అర టీస్పూన్‌ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి.తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. కీరా జ్యూస్‌లో బియ్యపు పిండిని కలిపి పాదాలకు ప్యాక్‌గా వేసుకుంటే కాళ్ళపగుళ్ళు తగ్గుతాయని బ్యూటీషన్లు అంటున్నారు. 
About Writer
Selvi
తర్వాతి కథనం
పరగడుపున టీ, కాఫీలు తాగకూడదు.. అరటిపండ్లు, కూల్‌డ్రింక్స్ కూడా?