1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. cumin health benefits

జీలకర్ర, అరటిపండును కలిపి తీసుకుంటే..?

జీలకర్ర యాంటీ-సెప్టిక్ కారణాలను కలిగి వుండటం ద్వారా జలుబు, ఫ్లూను కలుగజేసే కారకాలను వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఒక కప్పు కాచిన నీటిలో జీలకర్ర, అల్లం, తేనె, తులసి ఆకులు కలుపుకొని తాగడం వల్ల జలుబు నుండి క

cumin health benefits
జీలకర్ర యాంటీ-సెప్టిక్ కారణాలను కలిగి వుండటం ద్వారా జలుబు, ఫ్లూను కలుగజేసే కారకాలను వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఒక కప్పు కాచిన నీటిలో జీలకర్ర, అల్లం, తేనె, తులసి ఆకులు కలుపుకొని తాగడం వల్ల జలుబు నుండి కూడా ఉపశమనం పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

జీలకర్ర యాంటీ ఏజింగ్‌గా పనిచేసి చర్మంపై ముడతలు రాకుండా నివారిస్తుంది. ఇందుకు జీలకర్రలో విటమిన్‌ ఇ ఎక్కువగా ఉండటమే కారణం. జీలకర్రలో ఎక్కువగా ఫైబర్‌, యాంటీ ఫంగల్‌, లాక్సైటీవ్స్‌, కార్మినేటివ్‌ గుణాలు ఉంటాయి. ఇవి మొలలు నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.
 
జీలకర్ర కాలేయంలో పైత్యరసం తయారవటాన్ని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోజువారీ ఆహారంలో జీలకర్ర తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్‌ లెవెల్స్ తగ్గిస్తుంది. దీనివల్ల మధుమేహం తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. జీలకర్రలో క్యాల్షియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, సోడియం, పొటాషియం, విటమిన్‌ ఎ, సి ఎక్కువగా ఉన్నాయి. జీలకర్రలో ఐరన్‌ పుష్కలంగా లభించడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ తయారవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
 
జీలకర్ర కడుపు నొప్పి, విరోచనాలు, ఓకారము, ఉదయపు అలసటను, అజీర్ణము వంటి వాటిని తగ్గిస్తుంది. కొత్తిమీరలో జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిపి తాగితే జీర్ణ శక్తి పెంపోందిస్తుంది. శరీరంలోని అనవసరపు కొవ్వుని కరిగిస్తుంది. షుగర్ వ్యాధిని నివారిస్తుంది. అరటి పండుని తీసుకొని దాన్ని బాగా నలిపి దాంట్లో జీలకర్ర పొడిని కలిపి తింటే హాయిగా నిద్రవస్తుంది. అధిక బరువు తగ్గుతారు.
About Writer
Selvi
తర్వాతి కథనం
పిల్లలకు కూల్ డ్రింక్స్ వద్దే వద్దు.. పల్చాటి మజ్జిగను తాగిస్తే..?