1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. health benefits of ash gourd

బూడిద గుమ్మడి కాయ రసాన్ని తాగితే ఏమవుతుందో తెలుసా...?

ఏ దిష్టీ తగలకూడదనీ బూడిద గుమ్మడి ఇంటి ద్వారానికి కడతాం. ఈ గుమ్మడిలో ఔషధ గుణాలూ ఎన్నో ఉన్నాయి. బూడిద గుమ్మడి కాయలోనూ విత్తనాల్లోనూ తీగలోనూ కూడా ఔషధ గుణాలున్నాయని వైద్యులు అంటారు. కడుపులో మంట, ఉబ్బరంగా ఉండటం, దాహం ఎక్కువగా ఉన్నప్పుడు బూడిద గుమ్మడి చక్క

ash gourd juice
ఏ దిష్టీ తగలకూడదనీ బూడిద గుమ్మడి ఇంటి ద్వారానికి కడతాం. ఈ గుమ్మడిలో ఔషధ గుణాలూ ఎన్నో ఉన్నాయి. బూడిద గుమ్మడి కాయలోనూ విత్తనాల్లోనూ తీగలోనూ కూడా ఔషధ గుణాలున్నాయని వైద్యులు అంటారు. కడుపులో మంట, ఉబ్బరంగా ఉండటం, దాహం ఎక్కువగా ఉన్నప్పుడు బూడిద గుమ్మడి చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. అలాగే మలబద్దకంతో బాధపడే వాళ్ళు రోజూ బూడిద గుమ్మడికాయను ఆహారంలో భాగంగా తీసుకుంటుంటే మలబద్దకం తగ్గుతుందట. 
 
అంతేకాదు ఈ విత్తనాల నుంచి తీసిన నూనెని చర్మవ్యాధుల నివారణలో వాడుతుంటారు. ఇంకా బూడిద గుమ్మడి తీగ రసాన్ని హై బిపి, నిద్రలేమితో బాధపడేవారికి ఇస్తే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది. అంతేకాదు... బరువు కూడా తగ్గిపోవచ్చు. బూడిదగుమ్మడి కాయ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేవి వడియాలు మాత్రమే. కానీ చలికాలంలో పిందె తొడిగి, వేసవి వరకూ పెద్దపెద్ద కాయలు కాసే ఈ గుమ్మడితో పసందైన వంటకాలెన్నో చేసుకోవచ్చు. 
 
అంతేకాదు, నీరు ఎక్కువుండే బూడిదగుమ్మడిలో కార్బొహైడ్రేట్లు, కొవ్వు అతి తక్కువ శాతం ఉండటంతో డైటింగ్‌ చేసే వారికి మంచి ఆహారము. బూడిద గుమ్మడి కాయ తొక్క, గింజలు కొబ్బరి నునెలో మరిగించి ఆ మిశ్రమాన్ని తలవెంట్రుకులకు రాస్తే జుట్టు మెత్తగా మారి, వెంట్రుకలు బాగా పెరుగుతాయి.
About Writer
chj
తర్వాతి కథనం
కాటుక పెట్టుకోవడం వల్ల ఫలితాలు ఏమిటి?