1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (11:35 IST)

పగటి పూట గంట కంటే ఎక్కువ సేపు నిద్రపోయారో.. టైప్-2 డయాబెటిస్ ఖాయం

రాత్రిపూట హాయిగా నిద్రపోండి. కానీ పగటి పూట నిద్ర మాత్రం వద్దే వద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. పగటి పూట అర్థగంట నిద్రపోతే మంచిదే కానీ.. గంటలపాటు పగటిపూట నిద్రపోతే మాత్రం ఆరోగ్యానికి దెబ్బేనని నిపుణులు చ

రాత్రిపూట హాయిగా నిద్రపోండి. కానీ పగటి పూట నిద్ర మాత్రం వద్దే వద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. పగటి పూట అర్థగంట నిద్రపోతే మంచిదే కానీ.. గంటలపాటు పగటిపూట నిద్రపోతే మాత్రం ఆరోగ్యానికి దెబ్బేనని నిపుణులు చెప్తున్నారు. తాజా పరిశోధనలో తేలిందేమిటంటే.. రోజూ పగటి పూట గంట కంటే ఎక్కువ నిద్రపోయేవారిలో టైప్-2 డయాబెటిస్ ముప్పు 45శాతం పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యో తెలిపారు. 
 
మధుమేహానికి కారణమయ్యే సమస్యలు కూడా పగటి నిద్రను పెంచుతాయని, అందుచేత దీనిని మధుమేహ ముందస్తు సూచనగా భావించవచ్చునని పరిశోధకులు అంటున్నారు. తాజాగా నిర్వహించిన పరిశోధనలో వేసవిలో పగటిపూట నిద్రించే వారిలో మధుమేహ ముప్పు ఎక్కువగా ఉందని వెల్లడైనట్లు, పగటిపూట నిద్రించే వారిలోనే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  
 
40 నిమిషాలు నిద్రపోతే పర్లేదు కానీ.. గంటకన్నా ఎక్కువసేపు కునుకు తీస్తే మాత్రం టైప్-2 మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. పగటి పూట ఎక్కువ సమయం నిద్రపోతే.. గాఢనిద్రలోకి చేరుకుంటారని, కానీ నిద్రవలయం పూర్తి కాకముందే మేలుకొంటారు కాబట్టి ఏకాగ్రత కోల్పోవడం, నిద్రమత్తు వంటి సమస్యలొస్తాయని పరిశోధకులు వెల్లడించారు. పగటి నిద్ర పెరిగితే రాత్రిపూట నిద్రలేమి కూడా వస్తుందని, దానివల్ల గుండె జబ్బు లు, జీవక్రియపరమైన సమస్యలు, టైప్‌-2 మధుమేహ ప్రమాదం ఏర్పడుతుందన్నారు.