శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 12 ఆగస్టు 2019 (21:38 IST)

రాత్రి పడుకోబోయే ముందు ఆ మిశ్రమాన్ని తాగితే చాలు...

ఇప్పుడు చాలామంది ఇబ్బందిపడుతున్న సమస్యల్లో పొట్టచుట్టూ కొవ్వు. ఈ కొవ్వు చేరడంతో పొట్ట బానలా పెరిగిపోయి చూసేందుకు వికారంగా కనబడుతారు. అలాంటి సమస్యను అధిగమించాలంటే ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
1. గోరువెచ్చగా ఉండే ఒక గ్లాస్ నీటిలో అవిసె గింజెల పొడి ఒక టీస్పూన్, తేనె ఒక టీస్పూన్ కలిపి ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు తాగాలి. ఇది కూడా పొట్ట దగ్గర కొవ్వును బాగా తగ్గిస్తుంది.
 
2. రెండు టేబుల్ స్పూన్ల తేనెను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో బాగా కలిపి దీన్ని ఉదయం పరగడుపునే తీసుకోవాలి. ఇది పొట్ట దగ్గర కొవ్వును తగ్గించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.
 
3. ఒక గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పూర్తిగా పిండాలి. దీన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే కొవ్వు కరుగుతుంది.
 
4. రెండు టేబుల్ స్పూన్ల క్రాన్‌బెర్రీ జ్యూస్‌ను ఒక గ్లాస్ నీటిలో కలిపి దీన్ని భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా చేస్తే తప్పక ఫలితం ఉంటుంది.
 
5. గోరువెచ్చని ఒక గ్లాస్ నీటిలో నువ్వుల నూనె ఒక టీస్పూన్, అల్లం రసం ఒక టీస్పూన్ మోతాదులో కలిపి రోజుకు రెండుసార్లు దీన్ని తీసుకోవాలి. ఇది పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది.
 
6. గ్రీన్ టీ పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1/4 టీస్పూన్, తేనె 2 టీస్పూన్లు తీసుకుని వీటిని ఒక గ్లాస్ నీటిలో కలపాలి. 3 నిమిషాల పాటు ఇలా చేయాలి. దీన్ని రోజుకి రెండుసార్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.