1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. Do you know what changes occur in a devotee after beholding the Lord of Lords venkateswra ?

Lord venkateswra : సర్వేశ్వరుడైన వేంకటేశ్వరుని దర్శించుకున్న తర్వాత భక్తునిలో ఎటువంటి మార్పులు కలుగుతాయో తెలుసా?

Tirumala Lord Sri venkateswra
Tirumala Lord Sri venkateswra
భూలోకంలో వైకుంఠం అంటే  తిరుమలలోని ఏడు కొండల శ్రీవేంకటేశ్వర స్వామి గురించే అందరూ చెబుతారు. నిజం కూడా అదే. కానీ అలాంటి వైకుంటేశ్వరుని దర్శించుకోవాలని కోటాను కోట్లమంది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆనందంతో వస్తుంటారు. చాలామంది దేవుడి దర్శించుకోవాలంటే ఆయన క్రుప, ఆశీస్సులు వుండాలి. లేదంటే మనం ఎంత ప్రయత్నించినా ఆ దర్శనం దక్కదు. ప్రయాణం షడెన్ గా మారుతుంది. ఏదో అడ్డంకి ఏర్పడుతుంది. మరి అలాంటి దేవదేవుడి గురించి ఆగమ శాస్త్రాలలో, పురాణాలలో  చాలా కథలు వున్నాయి.
 
పరమనిష్టాపురుషులు, భక్తులు దేవదేవుడితో పాచికలు ఆడడం, ఆయన దర్శనంతో మాట్లాడుకోవడం కథలుగా మనం విన్నాం. శ్రీక్రిష్ణ దేవరాయాలు కాలం నుంచి కానీ అంతకుముందు నుంచి కానీ తిరుమలలో నేరుగా దేవుడిని దర్శించుకుని మొదటి గడపదాకా వెళ్ళేవారు. రాను రాను కాలంతోపాటు ప్రజానీకం పెరగడంతో అన్ని చోట్ల జనాల తాకిడి ఎక్కువడంతో తిరుమలకూ ఆ తాకిడి తాకింది. దానితో అక్కడి నిర్వాహకులు అనండీ, పీఠాదిపతులు అనండి, పూజారు అనండి... కొత్త రూల్స్ పెట్టారు. దానితో రకరకాల ఆంక్షలు పెట్టి, 7వ గడప వరకు 300 రూపాయలు, ధర్మదర్శనం ద్వారా దర్శించుకునే ఏర్పాట్లు చేశారు.
 
భక్తుల తాకిడి ఎక్కువ కావడం, వ్యాపారాలలో కోట్లకు కోట్లు లాభాలు రావడంతో దేవదేవుడికి కోట్ల రూపాయల కిరీటాలు, ఉంగరాలు, కట్టడాలు, ఇలా చాలా దేవుడికి భక్తితో సమర్పించుకుంటున్నారు. దానికితోడు కోటి 50 లక్షలు పెడితే సుప్రబాత సేవ, అభిషేకం, అర్చన తో పాటు ఎన్నో తోమాల సేవలు అంటూ వివిధ పేర్లతో దేవుడిని దగ్గరుండి చూసే భాగ్యం కలుగుతుంది.
 
ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి. ఇదంతా అందరికీ తెలిసిందే. అయితే ఎక్కడ మంచి వుంటుందో అక్కడ చిన్నపాటి లోపాలుంటాయి. అవి సరిదిద్దుకోవాల్సిన అవసరం వుంది. కానీ దానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వారు కానీ, ఆలయ పూజాలు కానీ, పీఠాధిపతులు కానీ రెట్టిఫై చేయాలి. కానీ అది జరగడంలేదు. 
 
దానితో అక్కడి వ్యవహారాలను వేలెత్తి చూపించడకంటే... పరమ భక్తుడిగా నేను కొద్దిగైనా చెప్పాలనించింది. అది మామూలుగా అక్కడి వారితో చెబితే మన మాటలు వినరు. అందుకే ఇలా రాయాలని ఓ రాత్రి పూజ మదిలో తొలుస్తునే వుంది. బహుశా దేవుడి ఆజ్నగా భావించి రాయకతప్పలేదు. వారం రోజులనుంచి మనసులో తొలుస్తుంటే.. ఈ శనివారం రాయాలనిపించి.. .దేవదేవుడిని ధ్యానించుకుకని రాయకతప్పలేదు.
 
స్వామీజీలు, పీఠాధిపతులు ఏం చెబుతున్నారంటే...
మనల్ని ఎవరైనా స్పర్శ చేస్తే అది అవతలి వ్యక్తి దరిద్రం మనకు వస్తుంది. ఎవరినీ తాకరాదు. అది పురాణాల్లోనూ చెప్పబడింది. ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ వుండే వ్యక్తి దర్శనానికి వెళితే.. లైన్ లో ఎవరెవరో మనల్ని పట్టుకుని చేయి లాగడం, భుజంపై చేయి వేసి తోయడం వంటివి అనేవి జరుగుతున్నాయి. 
 
ప్రతి మనిషిలో కరెంట్ కూడా (శక్తి) వుంటుంది.  మనలో 40 డిగ్రీల నుంచి 100 డిగ్రీల వరకు కరెంట్ వుంటుంది. జపతపాలు చేసేవారిలో ఆ శక్తి ఎక్కువుగా వుంటుంది.  దాని వల్ల అందరిలో ఆరా మన చుట్టూ వుంటుంది. మనల్ని తాకితో మనకూ నష్టం. అవతలివారికి కొంచెం నష్టం కానీ అవతలి వ్యక్తి లో నెగెట్ శక్తి వుంటే అది మనకు వస్తుంది. 
 
కంటి చూపుతో చంపేస్తానంటూ ఓ సినిమాలో డైలాగ్ వుంటుంది. కనులు కనులు. చూసుకుంటూ సాగే పాటలున్నాయి. అంటే కన్నులు చూసినా కూడా దిష్టి తగులుతుంది. అలాంటి ఎన్నో కోట్ల కన్నులు చూసిన తిరుమల దేవుడిని దర్శించుకున్నాక పలుసార్లు స్వామివారికి దిష్టి తీస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికే దిష్టి తగులుతుందని పూజారాలు, ఆగమన శాస్త్రాలు చెబుతుంటే. సామాన్యుడు దేవుడిని తనివితీరా చూడకుండా లాగేస్తుంటే చూసే మనిషిలో ఎనర్జీ నిర్వీర్యమవుతుంది. 
 
అందుకే దేవదేవుని చూశాక మనకు ఎనర్జీ వుంటుంది. అలాగే ఎవరినీ తాకకుండా బయటకు రావాలి. అలా వివివిఐ పి దర్శనాల్లో తాకకుండా వుంటుంది. కానీ సామాన్యుడికి అలా వుండదు. వాలంటీర్ల పేరుతో చాలామంది చేయి పట్టుకుని లాగేస్తూ, మరోవైపు కేకలు వేస్తూ, రండి.. కదలండి.. అంటూ అరుస్తూ, వుంటే భక్తుడి మనసులోని కోరిక దేవుడికి ఎలా చెబుతాడు. మనసు ఎలా నియంత్రణకు వస్తుంది. 
 
దీనిపై ఓ సీనియర్ ఆద్యాత్మిక గురువు చెప్పినట్లు, దేవదేవుడిని దర్శించుకుని గుడి ఆవరణలో కాసేపు వుండి, బయటకు వచ్చాక ప్రసాదం తిన్నంతవరకు మనలో ఎనర్జీ బాగానే వుంటుంది. కానీ ఒకసారి ఆలయం బయటకు వచ్చాక అప్పటి వరకు వున్న శక్తి మనలో కనిపించదు. కాస్త నిస్సత్తువగా వుంటుంది.  దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. దేవుడిని చూశామన్న ఆనందంతోనే చాలాసేపే నెమరేసుకుంటారు. ఆ తర్వాత దైనందిక పనుల్లో పడి దానిని మర్చిపోతాం.
 
ఇక వాలంటీర్లుగా వున్న వారి గురించి చెప్పాలంటే చాలా కథే వుంది. వారు అక్కడ వుండే వ్యక్తులు కాదు. బయట వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉచితంగా సేవచేస్తే, దేవుడి దర్శనం ఇప్పిస్తారని ెకొందరు గ్రూప్ గా ఏర్పడి వచ్చి చేస్తున్న సేవలే. 
 
దీనిపై అక్కడి ఉద్యోగులను అడిగితే, వారు చెప్పిన సమాధానం ఆశ్చర్యం వేయక మానదు.  సేవ పేరుతో ప్రతి చోట్ల భక్తులు రావడంతో చాలా సంవత్సరాలనుండీ గుడిలో ఉద్యోగాలు లేకుండా పోయాయి. అంటూ చాలా ఉదహనాలు ఇవ్వడం విశేషం.
 
అందుకే వారిని టచ్ చేయకుండా గుడిలో దర్శనం చేసుకుని బయటకు రాావలి. ఇది పాలకులు తగు చర్యలు తీసుకోవాలి. ఒక వేళ అక్కడ పూజాలు కానీ మనల్ని టచ్ చేస్తే వారి ఎనర్జీ కూడా మనకు వస్తుంది. ఇది చాలా కొద్ది మందికే అద్రుఫష్టం దక్కుతుంది.
 
కొసమెుపుపు ఏమంటే... మనం బయటకు వచ్చి మాడవీధుల్లో వస్తుండే పక్కనుంచి ఎవరైనా తగిలినట్లు అనిపిస్తుంది. చూస్తే,, పూజారి నడుచుకుంటూ తనశైలిలో వెళ్లిపోతుంటారు. అలాంటి వారు మనల్ని టచ్ చేసేలా అనుభూతి కలిగినా, ఆయన కడువా మనకు గాలికి తాకినా... శుభప్రదంగా వుంటుందని శాస్త్రాల్లో చెప్పబడింది. ఇది కూడా దైవ క్రుపగా చెబుతుంటారు. 

ఇలా అనుభం కలవారు కొద్దిమంటే వుంటారు. అలా నాకు ఎవరో టచ్ చేసినట్లు అనిపించి కాస్త కోపంగా వెనక్కి తిరిగిచూశాక.. ఓ పూజారి కనిపించారు. దానితో వెంటనే మనసు శాంతించింది. ఇలా చాలామందికి కలిగి వుంటుంది కూడా.
 
ఫైనల్ గా చెప్పేదేమంటే... దేవదేవుడిని తనివితీరా చూడలేకపోయినా చూసిన కొద్దిసేపైనా దేవుడి ఆశీస్సులు మనపై వుంటాయి. ఇలా వాలంటీర్లు భక్తుల్ని తోయడం అనేది  మానుకోవాలి. ప్రతి భక్తుడి ఆవేదన. ఇలాంటి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాలకమండలి తీసుకోవాలి. మామూలుగా ఎవరైనా మనల్ని టచ్ చేసినా తోసినా మనం కోపం వస్తుంది.  కానీ ఆ కోపమే అక్కడా వస్తుంది. కానీ ఏమీ చేయలేక మనల్ని మనం తిట్టుకుంటాం. ఇంతకన్నా చేసేదిలేదంటే.మన ప్రాప్తంఅనుకోవాలా? ఇలా జరగడం వల్ల మనకు దక్కాల్సిన శక్తి దక్కుండా పోతుంది... ఏమంటారు..
About Writer
దేవీ
తర్వాతి కథనం
సెప్టెంబరు నెల శ్రీవారి దర్శన కోటా టిక్కెట్లు - 18న ఆన్‌లైన్‌లో విడుదల