1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. glories days for traditional cow

గోవులకు పూర్వ వైభవం : టిటిడి జేఈవో

ttd
గోవులకు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రయత్నిస్తుందని ఆ సంస్థ సంయుక్త కార్యనిర్వహణాధికారి పోలా భాస్కర్ అన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2015ను గోసంరక్షణ సంవత్సరంగా పరిగణిస్తున్నట్లు ఆయన చెప్పారు.  
 
మనగుడి గోపూజ కార్యక్రమంపై శ్వేతలో ధర్మప్రచార మండలలు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సంక్రాతిలో ముఖ్యమైన కనుమ పండుగను పరిగణిలోకి తీసుకుని గోపూజ నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 260 గొశాలలో ఈ కార్యక్రమంలో చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 
About Writer
PYR