1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. jayaprada hints party changed

మొన్ననేగా ఎన్నికలయ్యింది.. రాజకీయాలకు ఇంకాటైముంది..! : జయప్రద

jayaprada
ఈ మధ్యనే ఎన్నికలు అయ్యాయని ఎన్నికలపై మాట్లాడడానికి ఇంకా సమయముందని సినీ నటి, మాజీ ఎంపి జయప్రద తెలిపారు. తాను ఏ పార్టీలో చేరాలనే అంశంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని, అందుకు కూడా ఇంకా సమయముందని ఆమె వివరించారు. 
 
ఆదివారం ఉదయం తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆమె ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామిని ప్రార్థించానన్నారు. తాను హరీష్ రావును మర్యాద పూర్వకంగా కలిశానే తప్ప ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవన్నారు. హరీష్ రావు తన సోదరుడిలాంటి వారని చెప్పారు. 
About Writer
PY REDDY