1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
  4. doma movie

విడుదల సన్నాహాల్లో 'దోమ'

doma movie
దోమల్ని నివారించడం కోసం ఓ మనిషిపై చేసిన ప్రయోగం వికటించడం వల్ల ఏర్పడే విపరిణామాల సమాహారంగా అత్యంత ఉత్కంఠభరితంగా రూపొందిన ఎంటర్‌టైనింగ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'సకర్‌'. యస్‌.యస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొంది ఘనవిజయం సాధించిన 'ఈగ' తరహా ఎంటర్‌టైన్‌మెంట్‌తో, గ్రాఫిక్స్‌కు పెద్ద పీట వేస్తూ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ గ్రాఫికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెలుగులో 'దోమ' పేరుతో విడుదల చేస్తున్నారు.

 
మైఖేల్‌ మనస్సెరి స్వీయ దర్శకత్వంలో- తనే హీరోగా రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'మ్యాజిక్‌ మూవీస్‌' పతాకంపై వరప్రసాద్‌ విడుదల చేస్తున్నారు. కింబర్లీ కేట్స్‌, జోర్డాన్‌ ట్రొవిలియన్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం అతి త్వరలో తెలుగులో విడుదల కానుంది. 
 
ఈ సందర్భంగా నిర్మాత వరప్రసాద్‌ మాట్లాడుతూ... 'సంచలన దర్శకులు రాజమౌళి రూపొందించిన 'ఈగ' చిత్రాన్ని తలపిస్తూ, ఆద్యంతం ఉత్కంఠ రేపుతూ వినోదాత్మకంగా రూపొందిన మేజికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీ ఇది. కొత్తదనాన్ని కోరుకొనే ప్రేక్షకులందర్నీ అమితంగా ఆకట్టుకొనే ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం' అన్నారు!!
About Writer
DV