1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
  4. Benefits and Uses of Neem

వేపలో ఉండే ఔషధ విలువలేంటో తెలుసా?

Neem
వేప చెట్టుతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వేప చెట్టులోని ఆకులు, కాండం, నూనె, పూలు, గింజలు, పండ్లు ఇలా ప్రతిదాంతోనూ ఓ ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా మహిళల సౌందర్య పోషణలో ఇది ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. 
 
వేపాకులో ఉండే యాంటీ - బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ అంశాల కారణంగా పలు రకాల చర్మ అలెర్జీలకు, ఇన్‌ఫెక్షన్లకు, మొటిమలకు, దద్దుర్లకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. వేపాకు పేస్ట్‌ను వాడటం ద్వారా ముఖం మీది మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. పొడి చర్మపు సమస్యకు ఇది ఓ చక్కటి పరిష్కారమార్గం. తలకు వేపాకు పట్టించడం ద్వారా తల మీదున్న దురద, చుండ్రు సమస్యలు తొలగిపోవడంతో పాటు జుత్తు కూడా బాగా పెరుగుతుంది. 
 
అలాగే, సంప్రదాయంగా వేప ఆకులతో తయారు చేసే ఔషధాలు మలేరియా, మధుమేహం, గుండె జబ్బులు, చర్మవ్యాధుల నివారణకు ఉపయోగించవచ్చు. గర్భనిరోధకంగా పనికొచ్చే అంశాలు కూడా వేపలో ఉన్నాయి. యాంటీ అల్సర్‌, యాంటీ ఫంగ్‌సగా ఉపయోగపడే మూలకాలు కూడా వేపలో ఉన్నాయి. ప్రతి రోజూ వేపాకు చిగుర్లను ఆరగిస్తూవుంటే కేన్సర్‌ కణాలు బహుముఖంగా విస్తరించే అవకాశాలు తగ్గిపోతాయి. వేప పేస్ట్‌ యాంటీ - బ్యాక్టీరియల్‌ నిర్మూలకంగా పనిచేయడంతో పాటు, స్వల్పంగా ఉన్న చర్మ సంబంధితమైన ఇన్‌ఫెక్షన్లను, గాట్లను, పుండ్లను మాన్పడంలో బాగా ఉపయోపడుతుంది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి